రాశి ఎన్టీఆర్లో జయప్రద పాత్రకు సై!

Update: 2018-08-17 13:57 GMT
నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్  ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ఇప్పటికే సినిమాలో టాలీవుడ్ సెలబ్రిటీల పాత్రల్లో నటించేందుకు పలువురు ప్రముఖ నటీనటులు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.  తాజాగా సీనియర్ నటి జయప్రద పాత్రలో నటించేందుకు రాశి ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

జయప్రద పాత్రకోసం రాశి ని ఇదివరకే క్రిష్ సంప్రదించడం జరిగిందని వార్తలు వచ్చాయి గానీ ఆమె జయప్రద క్యారెక్టర్ లో నటించేందుకు ఒప్పుకుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.  కానీ తాజా అప్డేట్ ప్రకారం రాశి ఒప్పుకోవడమే కాదు 'ఎన్టీఆర్' కు తన కాల్ షీట్స్ కూడా ఇచ్చిందట.  త్వరలో షూటింగ్ లో కూడా పాల్గొంటుందట.  ఇక జయప్రద విషయానికి వస్తే.. ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో ఎన్టీఆర్ తో నటించింది.  

K. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'అడివిరాముడు'  లో  ఎన్టీఆర్-జయప్రద పెయిరింగ్ అయితే ఎవర్ గ్రీన్.  ఆ సినిమా 1977 లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో  'ఆరేసుకోబోయే పారేసుకున్నాను.. అరె అరె.. కోకెత్తుకెళ్ళింది కొండగాలీ' అంటూ సాగే సూపర్ రొమాంటిక్ సాంగ్ ఉంది.  అబ్బా ఏం రొమాన్సు.. మరి బాలయ్య-రాశి లో ఆ పాటేసుకుంటారో ఏమో... అంతా క్రిష్ దయ మన ప్రాప్తం!
Tags:    

Similar News