ప్ర‌భాస్ సైన్స్ ఫిక్ష‌న్ డ్రామాలో రాశీ జాక్ పాట్

Update: 2021-06-12 02:30 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఆదిపురుష్ 3డి - స‌లార్` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్ని ఇప్ప‌టికే సెట్స్ పైకి తీసుకెళ్లారు. త్వ‌ర‌లోనే వీటికి సంబంధించిన షెడ్యూల్స్ ని తెర‌కెక్కించే ప్లాన్ లో ఉన్నారు. త‌దుప‌రి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలో న‌టించేందుకు ప్ర‌భాస్ సంసిద్ధంగా ఉన్నారు.

ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో దీపికా పదుకొనే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీల‌క‌ పాత్రలో క‌నిపిస్తారు. తాజా స‌మాచారం మేర‌కు ఇందులో రాశీ ఖ‌న్నా కూడా ఒక క‌థానాయిక‌గా న‌టిస్తార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం రాశీతో నిర్మాత‌లు మంత‌నాలు సాగిస్తున్నార‌ని వెల్ల‌డైంది. రాశీ పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది అటుంచితే ఇది నిజంగానే క్రేజీ ఆఫ‌ర్. రాశీఖి ఇదే తొలి పాన్ ఇండియ‌న్ సినిమా. పైగా ప్ర‌భాస్ లాంటి  పాన్ ఇండియా స్టార్ తో ఆఫ‌ర్ అన‌గానే రాశీ ద‌శ దిశ తిరిగిపోవ‌డం ఖాయ‌మేన‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి ఈ సినిమా వ‌చ్చే నెల‌లో ప్రారంభం కావాల్సి ఉన్నా మ‌హ‌మ్మారీ వ‌ల్ల షెడ్యూల్ పోస్ట్ పోన్ అయ్యింది. 2022లోనే సెట్స్ పైకి తీసుకెళ్లి 2023లో విడుద‌ల చేస్తార‌ట‌. ఇక ఈ మూవీలో దీపిక లాంటి డామినేటెడ్ హీరోయిన్ ఉండ‌గా రాశీకి ఠ‌ఫ్ కాంపిటీష‌న్ త‌ప్ప‌దు. రాశీ ఖ‌న్నా మ‌ద్రాస్ కేఫ్ అనే బాలీవుడ్ చిత్రంతో ఆరంగేట్రం చేసింది కాబ‌ట్టి హిందీ ఆడియెన్ లోనూ త‌న‌కు కొంత గ్రిప్ ఉంది. అది త‌న‌కు పెద్ద‌ ప్ల‌స్ కానుంది.
Tags:    

Similar News