• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎక్స్ క్లూజివ్: 12న...

ఎక్స్ క్లూజివ్: 12న రంగస్థలానికి పవర్ స్టార్

By - Tupaki Desk
Update: 2018-04-10 09:22 GMT
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ న‌టించిన ‘రంగ‌స్థ‌లం’ సినిమా రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు అమెరికా- ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఇప్పుడు ఆ విజ‌యానందాన్ని ప్రేక్ష‌కుల‌తో పంచుకునేందుకు ఓ స‌క్సెస్ ఫంక్ష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించింది చిత్ర బృందం.

‘రంగ‌స్థ‌లం’ సినిమా వంద కోట్ల గ్రాస్ క్ల‌బ్ లో చేరిన‌ప్పుడే ఓ మీడియా స‌మావేశం ఏర్పాటుచేసింది చిత్ర యూనిట్‌. అప్పుడే రామ్ చ‌ర‌ణ్ మ‌రో స‌క్సెస్ ఫంక్ష‌న్ ఉంటుంద‌నే విష‌యం చెప్పాడు. ఇప్పుడు ఈ నెల 12న  సాయంత్రం హైద‌ర‌బాద్ లో విజ‌యోత్స‌వం జ‌రుప‌బోతున్నారు. ఈమేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అయితే ఈ వేడుక‌కి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాబాయ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా వ‌స్తుండ‌డం విశేషం. ఈ మ‌ధ్య‌నే కుటుంబ స‌మేతంగా రంగ‌స్థ‌లం సినిమా చూసిన బాబాయ్‌... అబ్బాయ్ న‌ట‌న‌ను- ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ను మెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. అందుకే స‌క్సెస్ మీట్ కి వ‌చ్చిన అభిమానుల స‌మ‌క్షంలో అబ్బాయిని పొగిడేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఈ విష‌యాన్ని ధృవీక‌రిస్తూ... నిర్మాతలు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రంగ‌స్థలం సినిమా 150 కోట్ల గ్రాస్ క్ల‌బ్ లో చేరిన విష‌యాన్ని కూడా స్ప‌ష్టం చేశారు. దీంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక మ‌ళ్లీ అబ్బాయ్ - బాబాయ్ ల‌ను ఒకే వేదిక‌పై చూసే అదృష్టం అభిమానుల‌కు క‌ల‌గ‌నుంది.
Tags:    
  • Ram Charan 
  • Rangasthalam movie 
  • Telugu NEws 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS