• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప' డైరెక్ట‌ర్...

'పుష్ప' డైరెక్ట‌ర్ రంగ‌స్థ‌లం అంటూ ఆడిస్తారా?

By - Tupaki Desk
Update: 2022-01-21 11:35 GMT
బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత కేజీఎఫ్ .. ఆ త‌ర్వాత పుష్ప బాలీవుడ్ మార్కెట్లో స‌త్తా చాటి ఆ సినిమాల్లో న‌టించిన హీరోల గ్రాఫ్ ని ఉత్త‌రాదిన అమాంతం పెంచాయి. హిందీ బెల్ట్ లో 100 కోట్ల క్ల‌బ్ అంత‌కుమించిన వ‌సూళ్ల‌తో సత్తా చాట‌గ‌ల హీరోలుగా ప్ర‌భాస్ .. య‌ష్ నిరూపించారు. ఆ త‌ర్వాత పుష్ప‌రాజ్ పాత్ర‌లో స‌త్తా చాటిన బ‌న్ని  క‌రోనా క్రైసిస్ కొన‌సాగుతున్నా.. ఓటీటీలో విడుద‌లైపోయినా ఇప్ప‌టివ‌ర‌కూ పుష్ప వ‌సూళ్ల హ‌వా సాగింది. అంతగా బ‌న్ని త‌న‌దైన న‌టన‌తో వ‌ర్క‌వుట్ చేసాడు. దాదాపు 75కోట్లు పైగా పుష్ప - ది రైజ్ వ‌సూలు చేసింది.

ఈ సినిమాతో బ‌న్ని పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలిగాడు. ఇక‌పోతే ఆ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో పాన్ ఇండియా లీగ్ లో స‌త్తా చాటాల‌ని ఆశించిన చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. ఆర్.ఆర్.ఆర్ వాయిదా ప‌డ‌డం ఆ ఇద్ద‌రికీ నిరాశ‌ను మిగిల్చింది. అయితే ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడు రిలీజైనా స‌త్తా చాటుతామ‌నే ధీమా చ‌ర‌ణ్‌.. తార‌క్ లో ఉంది. హిందీలోనూ పెద్ద స్టార్లుగా త‌మ‌ను తాము ప్రూవ్ చేయాల‌న్న సంక‌ల్పం ఆ ఇద్ద‌రిలో ఉంది.

ఇంత‌లోనే రామ్ చ‌ర‌ణ్ కి మ‌గ‌ధీర‌తో వ‌చ్చిన గుర్తింపు ఇప్పుడు ఇత‌ర సినిమాల‌తో వ‌స్తే ప్ల‌స్ కానుంద‌ని అంచ‌నా. మ‌రోవైపు చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం హిందీ వెర్ష‌న్ ని ఈ పాండ‌మిక్ లోనే విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. బ‌హుశా పుష్ప డైరెక్ట‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాగానూ  హిందీ వెర్ష‌న్ కి ప్ర‌మోష‌న్ ప‌రంగాను క‌లిసొస్తుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. ఫిబ్ర‌వ‌రిలో రంగ‌స్థ‌లం-హిందీ వెర్ష‌న్ విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం థియేట‌ర్లు డ్రైగా ఉండ‌డంతో థియేట‌ర్ల రంగానికి ఈ సినిమా ఊపు తెస్తుంద‌ని ఎగ్జిబిట‌ర్లు భావిస్తున్నార‌ట‌. పుష్ప త‌ర‌హా ర‌గ్డ్ డ్ హీరోయిజం ఉన్న రంగ‌స్థ‌లంతో హిట్టు కొట్టాల‌ని ఉవ్విళ్లూరుతున్నార‌ట‌.
Tags:    
  • Rangasthalam 
  • Sukumar 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS