బాబు అవతారంలోకి భల్లాలదేవుడు

Update: 2018-08-13 07:32 GMT
అంతకు ముందు బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ గురించి చెప్పుకోవాలంటే విక్రమ్ - ఆమీర్ ఖాన్ లాంటి ఇండియన్ యాక్టర్లను.. లేదా హాలీవుడ్ సినిమాలు అదేపనిగా చూసేవాళ్ళయితే  క్రిస్టియన్ బేల్ ను చెప్పుకునేవాళ్ళు.  తెలియని వాళ్ళు గూగుల్ లో అయన పేరు కొట్టండి.. అపుడు అయన సంగతి తెలుస్తుంది.    వెయిట్ స్కేల్  బేల్ ముందు పెట్టి నెల రోజుల్లో ఈ పర్టికులర్ వెయిట్ కి రమ్మని చెప్తే.. నెల తర్వాత ఆ అవతారంలోకి వచ్చి చూపిస్తాడు.  తాజాగా ఈయన 'ఫోర్డ్ వెర్సస్ ఫెరారీ' అనే సినిమా కోసం 'దంగల్' అమీర్ ఖాన్ లా తయారయ్యాడు. వీళ్ళందరూ సరే.. మనకు తెలుగులో ఇప్పుడు రానా దగ్గుబాటి కూడా అలానే బాడీ వెయిట్ ను మారుస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు.

రానా 'ఎన్టీఆర్' సినిమాలో నారా చంద్రబాబు నాయుడుగారి పాత్రలో నటించబోతున్నాడనే విషయం తెలిసిందే కదా.  అందుకోసం రీసెంట్ గా రానా స్లిమ్ అవతారంలోకి మారి అందరికీ షాక్ ఇచ్చాడు.  'బాహుబలి' సినిమా కోసం భారీగా కండలు పెంచి భల్లాల దేవుడు పాత్రలో అందరినీ మెప్పించిన ఆ రానా నిజంగా ఇతనేనా అనేలా మారిపోయాడు.  దానికి తోడు క్లీన్ షేవ్ చేసుకొని మీసాలు పెంచడంతో రానా పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

గెటప్పు మాత్రమే కాదట.. చంద్రబాబు వీడియోలు చూస్తూ అయనలా మారడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడట.  బాబుగారి బాడీ లాంగ్వేజ్ - మాట్లాడే తీరు అన్నిటినీ చక్కగా కాపీ కొట్టాలని డిసైడ్ అయ్యాడట.  మరి ఆ రకంగా రానా ముందుకుపోతున్నాడు!
Tags:    

Similar News