'అజ్ఞాతవాసిలో పవన్ లా ఎప్పుడూ శ్రీవిష్ణు సపోర్ట్'.. Tupaki ఎక్స్ క్లూజివ్ లో కామ్రేడ్ కళ్యాణ్ డైరెక్టర్

దర్శకుడిగా పని చేయాలంటే పేషెన్స్ చాలా ముఖ్యమని జానకిరామ్ అన్నారు. 2010లో దర్శకుడు సముద్రఖని దగ్గర తన జర్నీీ మొదలైందని, ఆ తర్వాత మంచు మనోజ్ దగ్గర పనిచేశానని చెప్పారు.

Update: 2026-09-23 09:38 GMT
Full View

హీరో శ్రీవిష్ణు సినిమాలంటేనే స్టోరీలో ఫ్రెష్ నెస్, రోల్ లో స్పెషాలిటీ ఉంటుందని ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ మూవీతో మరోసారి అలాంటి విభిన్న ప్రయత్నంతో ఆయన ముందుకు వస్తున్నారు. ఆ సినిమా విషయంలో హీరో శ్రీవిష్ణు ఇచ్చిన సపోర్ట్ గురించి దర్శకుడు జానకిరామ్ మారెళ్ల Tupaki ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసిలో అత్తకు ఆయన ఎలా అండగా నిలుస్తారో.. తన సినిమాకు శ్రీవిష్ణు అలా సపోర్ట్ గా నిలిచారని దర్శకుడు తెలిపారు. కామ్రేడ్ కళ్యాణ్ సినిమాను 2023లోనే అనుకున్నామని చెప్పారు. అయితే సుమారు రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయని, 2025 ఫిబ్రవరి 1న సినిమా షూటింగ్ మొదలైందని తెలిపారు. కథ సిద్ధం చేసుకునే సమయంలో శ్రీవిష్ణును హీరోగా అనుకున్నామని, ఆయనకు కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పారని వెల్లడించారు.

దర్శకుడిగా పని చేయాలంటే పేషెన్స్ చాలా ముఖ్యమని జానకిరామ్ అన్నారు. 2010లో దర్శకుడు సముద్రఖని దగ్గర తన జర్నీీ మొదలైందని, ఆ తర్వాత మంచు మనోజ్ దగ్గర పనిచేశానని చెప్పారు. ఆ సమయంలో బాబీని కలిశానని, ఆయన తనకు గురువులాంటి వారని తెలిపారు. అలాగే దర్శకుడు కిషోర్ తిరుమల దగ్గర కూడా పనిచేశానని చెప్పారు. పెద్ద దర్శకులతో పనిచేయడం వల్ల సినిమా మేకింగ్‌ పై చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు.

కామ్రేడ్ కళ్యాణ్ లో టీజర్ ద్వారా కథలోని దాదాపు పది శాతం విషయాన్ని మాత్రమే చూపించామని జానకిరామ్ తెలిపారు. ట్రైలర్‌ లో మరికొంత చూపించి, ఆ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. సినిమా పనులన్నీ పూర్తయ్యాయని వెల్లడించారు. శ్రీవిష్ణు, కోన వెంకట్ ఇచ్చిన సహకారం వల్లే తాను ఈ రేంజ్ లో మాట్లాడగలుగుతున్నానని దర్శకుడు చెప్పారు. వారిద్దరూ లేకపోతే సినిమా ఉండేది కాదని పేర్కొన్నారు.

ముఖ్యంగా శ్రీవిష్ణు ప్రతి విషయాన్ని తనతో డిస్కస్ చేస్తారని, క్లియర్ గా మాట్లాడతారని తెలిపారు. దర్శకుడిగా తనకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారని, తన టీమ్‌ లో కూడా ప్రతి ఒక్కరికీ ఫ్రీడమ్ ఇస్తానని జానకిరామ్ అన్నారు. పని విషయంలో ఎవరూ రాజీపడకుండా అందరూ ఓపెన్‌ గా తమ అభిప్రాయాలు చెప్పేలా చూసుకున్నానని తెలిపారు. సినిమా విషయంలో నిర్మాత కూడా పూర్తి కోపరేషన్ అందించారని చెప్పారు. రెమ్యునరేషన్లు, మేకింగ్ ఖర్చులు పెరిగినా నిర్మాత ఎక్కడా రాజీపడలేదన్నారు.

తన కెరీర్‌ లో దర్శకుడు బాబీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని జానకిరామ్ తెలిపారు. ఆయన దగ్గర కమర్షియల్ సినిమా ఎలా చేయాలో నేర్చుకున్నానని చెప్పారు. కిషోర్ తిరుమల దగ్గర నుంచి వాల్యూస్ నేర్చుకున్నానన్నారు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్‌ తో మంచి బాండింగ్ ఉందని చెబుతూ.. కామ్రేడ్ కళ్యాణ్ విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 9న సినిమా విడుదల కావడం ఫిక్స్ అని చెప్పారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు ఉండటంతో అదే తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పిన ఆయన, లవ్, యాక్షన్, కామెడీ, ఎంటర్టైనింగ్ అంశాలతో సినిమా ఉండబోతోందని క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News