ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇది కదా ర్యాంపేజ్ అంటే..
ముఖ్యంగా హైదరాబాద్ లో బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లో అమెరికా మార్కెట్ టాప్ లో ఉంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు ఇలా..
నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన ది ప్యారడైజ్ మూవీపై ఆడియన్స్ లో ఎంతటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. దసరా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే సినిమాపై హైప్ ఉంది. అందుకు తగ్గట్లే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ ద్వారా రూ.44 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ది ప్యారడైజ్ రూ.44.09 కోట్ల గ్రాస్ సాధించిందని ట్రేడ్ పండితుల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఇండియా నుంచి రూ.29.17 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ.14.92 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. దీంతో రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో వసూళ్లు రావడంతో సినిమా ఓపెనింగ్స్ పై అందరి ఫోకస్ పడింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్యారడైజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.22.69 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ లో బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లో అమెరికా మార్కెట్ టాప్ లో ఉంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు ఇలా..
ప్రపంచవ్యాప్తంగా: రూ.44.09 కోట్లు
ఇండియా: రూ.29.17 కోట్లు
ఓవర్సీస్: రూ.14.92 కోట్లు
ఏపీ + తెలంగాణ: రూ.22.69 కోట్లు
తెలంగాణ: రూ.14.05 కోట్లు
ఆంధ్రప్రదేశ్: రూ.8.64 కోట్లు
హైదరాబాద్: రూ.11.40 కోట్లు
అమెరికా: 1.16 మిలియన్ డాలర్లు
యూకే: 1,57,200 డాలర్లు
కెనడా: 1,04,000 డాలర్లు
ఆస్ట్రేలియా: 69,500 డాలర్లు
ఇక ది ప్యారడైజ్ విషయానికొస్తే.. సినిమా స్టోరీ 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. సమాజంలో గుర్తింపు లేకుండా, వివక్షకు గురయ్యే ఒక సంచార తెగకు చెందిన వ్యక్తి తమ రైట్స్ చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. నాని సినిమాలో ధగడ్ అలియాస్ జడల్ పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం నాని పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. డార్క్ అండ్ రఫ్ లుక్ తో ఆయన రోల్ ను డిజైన్ చేశారు.
మోహన్ బాబు, రాఘవ్ జుయాల్ విలన్స్ గా నటించారు. కాయదు లోహర్ హీరోయిన్ గా కనిపించనున్నారు. సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రలో నటించారు. సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు, తనికెళ్ల భరణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఆ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
భారీ యాక్షన్ సన్నివేశాలు, వైలెన్స్ ఉండటంతో సినిమాకు A సర్టిఫికెట్ వచ్చినట్లు సమాచారం. సినిమా రన్ టైమ్ 2 గంటల 49 నిమిషాలుగా ఉండనుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే రూ.44 కోట్ల మార్క్ దాటిన ది ప్యారడైజ్.. విడుదలకు ముందే రూ.50 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ప్యారడైజ్ మాస్ ర్యాంపేజ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.