• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జీవితంలో ఎంత‌ పెద్ద...

జీవితంలో ఎంత‌ పెద్ద స‌మస్య‌ను అయినా ఈజీగా తీసుకోవాల‌ని నేర్పింది!- రానా

By - Tupaki Desk
Update: 2021-03-21 11:50 GMT
``జీవితంలో ఎంత‌ పెద్ద స‌మస్య‌ను అయినా ఈజీగా తీసుకోవాల‌ని నేర్పింది ఈ సినిమా. మా అంద‌రిలో మార్పు తెచ్చింది`` అని అన్నారు ద‌గ్గుబాటి రానా. అత‌డు న‌టించిన అర‌ణ్య ఈనెల 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప్రీరిలీజ్ వేడుక‌లో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఇదే వేదిక‌పై లీడ‌ర్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌.. విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ  - ``కెమెరా ముందు ఒక వ్య‌క్తి ఎలా ఉండాలో నాకు నేర్పించింది శేఖ‌ర్ క‌మ్ములగారు.. ఆయ‌న కార్య‌క్ర‌మానికి రావ‌డం సంతోషంగా ఉంది.  నేను చాలా న‌ట‌న‌ నేర్చుకున్నాను అని చెప్ప‌డానికి ఆయ‌న్ని ఇక్క‌డికి పిలిచాను (న‌వ్వుతూ). ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను అడివి మ‌ధ్య‌లో..ఏనుగుల ద‌గ్గ‌ర ఉన్నాను. ఆ అనుభ‌వం మాటల్లో చెప్ప‌లేనిది. ఒక రియ‌ల్ రెయిన్ ఫారెస్ట్ మ‌ధ్య‌లో ఉండే ఎక్స్‌పీరియ‌న్స్ మీకు ఈ నెల 26న అర‌ణ్య‌తో తెలుస్తుంది. ఆ అడ‌విలో మ‌నుషులు చేసే అరాచ‌కాన్ని చూపించాం.  ఈ రోజు ఎక్క‌‌డ  అడివి ఉన్నా స‌రే  ఇలాంటి ఓ స‌మస్య ఉంది. నేను ఈ సినిమా కోసం రెండున్నర సంవత్స‌రాలు అడవిలో ఉన్నా.. నాకు ఆ ఏనుగుల‌తో ఉన్న రిలేష‌న్ వ‌ల్ల నా జీవితంలో ప్ర‌తి మనిషితో నాకున్న రిలేష‌న్ మారిపోయింది. మాములుగా నువ్వు ఎవ‌రు? అని తెలుసుకోవాలి అంటారు కాని ఈ సినిమా నాకు నేను ఎందుకు?  అని నేర్పించింది. మీరు ఈ భూమ్మీదే ఉంటారు ఈ భూమికోసం ప‌నిచేస్తే  ఆ భూమి తిరిగి మీకు మీ త‌ర‌త‌రాల‌కు ఇస్తుంది అని ఏనుగులు నేర్పించాయి. ప్ర‌భు సాల్మోన్ ఒక ఫోటో చూసి న‌న్ను సెల‌క్ట్ చేశారు. నాకు ఎంతో నేర్పించిన వ్య‌క్తి అయ‌న‌.  ఈ సినిమా  థాయిలాండ్- కేర‌ళ‌- స‌తార్‌- మ‌హా భ‌లేశ్వ‌రం.. ఇలా ఆరు అడ‌వుల‌లో తీశాం. ఈ సినిమా మా అంద‌రిలో మార్పు తెచ్చింది. జీవితంలో పెద్ద ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చినా ఎలా ఈజీగా  తీసుకోవాలో నాకు ఈ సినిమా నేర్పించింది. ఈ నెల 26న మీరు ఒక కొత్త ప్ర‌పంచంలోకి వెళ్ల‌బోతున్నారు‌`` అని అన్నారు.

వేదిక‌పై ఉన్న బాబాయ్ వెంక‌టేష్ గురించి ప్ర‌స్థావిస్తూ రానా చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంది. ``సాయి మాధ‌వ్‌గారు.. క్రిష్ ‌గారు క‌లిసి కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ సినిమాలో  మొత్తం భాగవత తత్వం నేర్పించారు. ఆ సినిమాలో సాయి మాధ‌వ్  రాసిన ఒక లైన్ నా జీవితాంతం మిగిలిపోయింది అది ఏంటంటే `చ‌ప్ప‌ట్లంటే వ్య‌స‌నం..ఆ చప్ప‌ట్ల మ‌ధ్య‌న ఒక్క‌డుంటాడు..దీన‌మ్మ ఇది నిజ‌మే క‌దా అని చూస్తుంటాడు.. ఆ ఒక్క‌డి కోసం నువ్వు నాట‌కం ఆడు`` అని ఇప్పుడు ఆ ఒక్క‌డి కోస‌మే ఈ సినిమా కూడా చేశాను. నాకు చిన్నాన‌లో ఏదో ఒక పార్ట్ అవ్వాల‌ని కోరిక ఉండేది. 11సంవ‌త్స‌రాల త‌ర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను..బాగా న‌టించ‌గ‌లుగుతున్నాను అని ఆయ‌న్ని ముఖ్య అతిథిగా పిలిచాం.. ఈ సినిమాలో మా నాన్న పాత్ర‌కి చిన్నాన వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు అని తెలిపారు.
Tags:    
  • Rana Speech 
  • Aranya Pre Release Event 
  • Tollywood 
  • Telugu News 

Similar News

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS