మరోసారి మేకోవర్ తో షాక్ ఇస్తున్న రానా..!

Update: 2019-04-25 06:48 GMT
రానా దగ్గుబాటి ట్విట్టర్ ఖాతా ను ఫాలో అయ్యేవారికి ప్రొఫైల్ పిక్.. హెడర్ ఫోటోలో ఏమున్నాయో తెలిసే ఉంటుంది.  ప్రొఫైల్ పిక్ అంటే  లెఫ్ట్ కార్నర్ లో ఉండే ఫోటో.. హెడర్ ఫోటో అంటే దానికి వెనక లెఫ్ట్ నుండి రైట్ వరకూ ఉండే ఇమేజ్.   రానా హెడర్ ఫోటోలో ఫోటో ఏమీ ఉండదు.  జస్ట్ ఒక కొటేషన్ ఉంది.. "యు వర్ నాట్ గివెన్ దిస్ లైఫ్ టు బీ యావరేజ్"  అర్థం అయిందిగా "నీకీ జీవితం ఇచ్చింది సాధారణంగా ఉండేందుకు కాదు".

జస్ట్ కొటేషన్ ను హెడర్ ఫోటోలో పెట్టుకోవడమే కాదు.. సిన్సియర్ గా ఫాలో అవుతాడు.  ఏ పని చేసినా డెడికేషన్ తో చేస్తాడు. ఒక పాత్ర కనుక ఎంచుకుంటే అందులోకి పరకాయ ప్రవేశం చేసేందుకు తపిస్తాడు. ఇప్పటివరకూ రానా ఎన్ని సార్లు తన శరీరాన్ని సినిమాల్లో పోషించే పాత్రలకు అనుగుణంగా మార్చుకున్నాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు మరోసారి తన కొత్త లుక్ తో అందరికీ షాక్ ఇస్తున్నాడు.  ఎన్టీఆర్ బయోపిక్ కోసం రానా స్లిమ్ గా మారిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాతా మళ్ళీ కాస్త వెయిట్ పెరిగాడు.  కానీ ఇప్పుడు తన కొత్త సినిమా 'విరాటపర్వం 1992' కోసం ఒక మళ్ళీ బక్కగా మారాడు.

ఈ సినిమాలో తక్కువ వయసున్న యువకుడి పాత్ర పోషిస్తున్నాడట.. దీంతో తన వెయిట్ ను చాలా తగ్గించి సన్నగా రివటలాగా మారిపోయాడు. అసలు పైన ఉండే ఫోటోను చూస్తే రానా డెబ్యూ ఫిలిం 'లీడర్' రోజులు గుర్తొస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ తేడా గడ్డం ఒక్కటే. భల్లాల దేవుడిగా భారీకాయంతో అందరినీ భయపెట్టిన ఆ రానా.. బక్కగా ఉన్నా ఈ రానా ఒకరే అంటే అసలు నమ్మలేం. ఈలెక్కన మరోసారి రానా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టే.  వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News