పవన్ పాలిటిక్స్ లో OG వైబ్

పవన్ కళ్యాణ్ లుక్స్, మాటలు, బిహేవియర్ లో ఒక వైబ్ ఉంటుందని, అతనికి ఎలాంటి ఫిల్టర్ అవసరం లేదని అభిమానులు బలంగా నమ్ముతూ ఉంటారు.

Update: 2024-05-07 04:13 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఈ ఎన్నికలలో బలమైన ప్రాతినిధ్యం ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు వ్యూహాత్మకంగా రాజకీయ ప్రసంగాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. వరుసగా బహిరంగ సభలతో అగ్రెసివ్ మాటలతో పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా కనిపిస్తున్నారు.


ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగాల సమయంలో ఇచ్చే హావభావాలు, లుక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ లుక్స్ ని పవర్ స్టార్ అభిమానులు విపరీతంగా ఇష్టపడుతుంటారు. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎలా ఉంటాడో సినిమాలలో కూడా అలానే కనిపిస్తాడని అభిమానులు ప్రశంసిస్తూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ లుక్స్, మాటలు, బిహేవియర్ లో ఒక వైబ్ ఉంటుందని, అతనికి ఎలాంటి ఫిల్టర్ అవసరం లేదని అభిమానులు బలంగా నమ్ముతూ ఉంటారు. మిగిలిన హీరోలని కుర్రాళ్ళు కేవలం సినిమాల వరకే ఫ్యాన్స్ గా ఉంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆగని ప్రతి విషయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆయనలో చూపులలో, మాటలలో నిజాయితీ ఉంటుందని అభిమానులు విశ్వసిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రసంగం సమయంలో తీసిన ఒక ఫోటో కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ రెండు ఫోటోలు పక్కపక్కనే జత చేసి పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఓజీ వైబ్ కనిపిస్తుందని ఫాన్స్ ట్వీట్ లు చేస్తున్నారు. ఈ కాంబినేషన్ ఫోటో కాస్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

Read more!

పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా ఏం చేసినా అతని చుట్టూ ఒక వైబ్ క్రియేట్ చేసి పబ్లిక్ ని ఎట్రాక్ట్ చేస్తాడని సెలబ్రెటీలు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. అలాగే అతన్ని లక్షలాది మంది ఆరాధించడానికి కారణం మాటల్లో, చూపుల్లో ఉండే కాన్ఫిడెన్స్, లీడర్ షిప్ ఆటిట్యూడ్ అని కామెంట్స్ చేస్తారు. ప్రస్తుతం OG సినిమా మూడ్ లో పవర్ స్టార్ అభిమానులు ఉన్నారు. అందుకే అతను పబ్లిక్ మీటింగ్స్ లో దిగిన ఫోటోలని OG లుక్స్ తో పోల్చి చూపిస్తున్నారు.

Tags:    

Similar News