RC16: బుచ్చిబాబు సడన్ ట్విస్ట్!

సుమారు 400 కోట్ల వరకు ఈ మూవీకి బడ్జెట్ అవుతుందని ప్రచారం నడుస్తోంది.

Update: 2024-05-07 04:12 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC16 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళనున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తూ ఉండగా, వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. సుమారు 400 కోట్ల వరకు ఈ మూవీకి బడ్జెట్ అవుతుందని ప్రచారం నడుస్తోంది. ఇదే నిజమైతే రామ్ చరణ్ కెరియర్ భారీ బడ్జెట్ మూవీగా RC16 ఉండబోతోంది.

ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. అలాగే ఇండియన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. RC 16 కోసం రెహమాన్ కి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. రామ్ చరణ్ కూడా కెరియర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ చిత్రానికి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ జోనర్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ కథ కోసం బుచ్చిబాబు ఉత్తరాంధ్ర నేపథ్యం ఎంచుకున్నారు. జూన్ నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు చాలా గ్యాప్ తీసుకొని ఈ చిత్రం చేస్తున్నారు. ముందుగా ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఒక ఫిక్స్ డ్ రెమ్యునరేషన్ తీసుకోవాలని అనుకున్నారంట. అయితే బడ్జెట్ ఎక్కువగా కనిపిస్తూ ఉండటం తన రెమ్యునరేషన్ ని వదులుకున్నారని తెలుస్తోంది.

Read more!

సినిమా రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా తీసుకోవడానికి ఒప్పుకున్నాడంట. బుచ్చిబాబుకి ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. అందుకే రెమ్యునరేషన్ వదులుకున్నాడని టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ అయితే మామూలుగా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో బడా దర్శకులు కొందరు హీరోలు ఇదే ఫాలో అవుతున్నారు.

మొదటి సినిమాతోనే 100 కోట్ల హిట్ అందుకున్న బుచ్చిబాబు ఈ RC16 తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకోవాలని భావిస్తున్నాడు. అలాగే భారీ లాభాలు నిర్మాతలకి ఇవ్వాలని అనుకుంటున్నారు. రామ్ చరణ్ కి కూడా RC16 కథ బాగా నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చెప్పేశారు.

ఈ సినిమాలో కూడా విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని బుచ్చిబాబు సంప్రదిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఒక వేళ ఈ ప్రాజెక్ట్ లో విజయ్ సేతుపతి భాగం అయితే మాత్రం సినిమాకి మరింత గ్రాండ్ లుక్ వస్తుంది. పాన్ ఇండియా అప్పీల్ ఉంటుంది కాబట్టి బెస్ట్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారని చెప్పవచ్చు.

Tags:    

Similar News