1905 గం.లు..163 మంది క‌ళాకారులు డిజైన్ చేసిన చీర‌!

తాజా ఈవెంట్లో ఆర్.ఆర్.ఆర్ సీత ఆలియా భ‌ట్ ఎంతో అందంగా ముస్తాబై ప్ర‌త్య‌క్షమైంది.

Update: 2024-05-07 04:19 GMT

మెట్ గాలా 2024 ఈవెంట్ క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పిస్తోంది. ఈ వేదిక‌పై బాలీవుడ్ అంద‌గ‌త్తెలు త‌ళుకుబెళుకుల ప్ర‌ద‌ర్శ‌న చ‌ర్చ‌గా మారింది. తాజా ఈవెంట్లో ఆర్.ఆర్.ఆర్ సీత ఆలియా భ‌ట్ ఎంతో అందంగా ముస్తాబై ప్ర‌త్య‌క్షమైంది. ఈ వేడుక కోసం ఆలియా ఎంపిక చేసుకున్న ఆ స్పెష‌ల్ డిజైన‌ర్ చీర‌పైనే అతిథుల క‌ళ్ల‌న్నీ. అంతగా ఆ చీర‌లో ఏం ప్ర‌త్యేక‌త ఉంది? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి.


అందాల ఆలియా భ‌ట్ ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట్రీటిస్తోంది. తాజాగా మెట్ గాలా ఈవెంట్లో ఆలియా స్ట‌న్న‌ర్ లుక్ తో మైమ‌రిపించింది. అంద‌మైన ఫ్లోర‌ల్ శారీ.. షోల్డ‌ర్ లెస్ టాప్ లో ఆలియా స్మైలిస్తూ ద‌ర్శ‌న‌మిచ్చింది. న్యూయార్క్ స్కైలైన్‌ను తాకే తీరుగా రూపొందించిన ఈ సిల్హౌట్ స్నాప్‌షాట్ ల‌ను ఆలియా షేర్ చేసింది. `మెట్ సెట్ గో` అని ఆటపట్టించే క్యాప్షన్‌తో ఈ పోస్ట్ ని షేర్ చేయ‌గా ఫోటోలు వైర‌ల్ గా మారాయి. మెట్ గాలా ఫ్యాషన్ కోలాహలంలో చీరలో క‌నిపించి భారతీయులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఆలియా.


భారతదేశంలో అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న‌ డిజైనర్లలో ఒకరైన సబ్యసాచి ముఖర్జీ రూపొందించబడిన చీర ఇది. ఈ అద్భుతమైన చీర‌ను సిద్ధం చేసేందుకు 1,905 పనిగంటలు.. 163 మంది కళాకారుల నైపుణ్యం అవసరమైంది. వోగ్ హోస్ట్‌లతో తన చిట్-చాట్‌లో, అలియా ఈ వ‌స్త్రం తాలూకా వివరాలను వెల్ల‌డించింది. పల్లుతో పాటు క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ క్యాస్కేడింగ్ కి ఈ చీర డిజైన్ లో ప్రాధాన్యతనిచ్చారు. మెట్ గాలాలో అలియా ఉనికి ప్రపంచ స్టైల్ ఐకాన్‌ హోదాను ప్రతిబింబించింది.

Read more!

బాలీవుడ్ తారలు చీరను గ్లోబల్ ఫ్యాషన్ స్టేజ్‌కి ఎలివేట్ చేశారు. సాంప్రదాయ సొబగులను సమకాలీన ఫ్లెయిర్‌తో సజావుగా మిళితం చేశారన‌డంలో సందేహం లేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, మెట్ గాలా స‌హా లాక్మే ఫ్యాష‌న్ వీక్ వంటి చోట్ల‌ అంతర్జాతీయ వీక్ష‌కుల‌ను మ‌న దేశ చీర క‌ట్టు సంస్కృతి ఆక‌ర్షించింది. బాలీవుడ్ ప్రముఖులు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు చీర లో అందాన్ని ప్ర‌త్యేక‌త‌ను ప‌రిచ‌యం చేసారు. ప్రియాంక చోప్రా, సోన‌మ్ క‌పూర్, దీపిక ప‌దుకొనే వంటి క‌థానాయిక‌లు గ్లోబ‌ల్ వేదిక‌ల‌పై చీర అందాన్ని ఆవిష్కృతం చేసారు. ఇదే వ‌రుస‌లో ఆలియా భ‌ట్ కూడా త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

Tags:    

Similar News