‘అరణ్య’లో రానా ఇంత కష్టముందా?

Update: 2020-02-26 05:30 GMT
రానా ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అరణ్య చిత్రం త్వరలో తెలుగుతో పాటు హిందీ ఇంకా తమిళంలో విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా ప్రమోషన్స్‌ ను కాస్త లో ప్రొఫైల్‌ లో నిర్వహిస్తూ ఉన్నా కూడా ఒక వర్గం ప్రేక్షకుల్లో మాత్రం ఈ సినిమాపై ఆసక్తి నెలకొనిఉంది. ఇక ఈ చిత్రంలో రానా అడవి మనిషి తరహాలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేసింది.

అరణ్య పాత్ర కోసం రానా పడ్డ కష్టంను చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా గొప్పగా చెబుతున్నారు. తాజాగా రానా కూడా తాను పడ్డ కష్టంను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బాహుబలి చిత్రం లో నటిస్తున్న సమయం లో భల్లాల దేవ పాత్ర కోసం వంద కేజీల వరకు బరువు పెరిగాను. ఆ బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నించాను. ఈ సినిమా కోసం ఏకంగా 30 కేజీల బరువు తగ్గినట్లుగా రానా చెప్పుకొచ్చాడు. ఒక హీరో 30 కేజీల బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు.

ఇక అరణ్య చిత్రం కోసం ఒక మారు మూల ప్రాంతంలో చిత్రీకరణ చేశారట. అక్కడ కనీసం మొబైల్‌ నెట్‌ వర్క్‌ కూడా ఉండేది కాదట. పైగా షూటింగ్‌ మొత్తం కూడా ఒక్కడిపైనే కాబట్టి కో ఆర్టిస్టులు ఎవరు ఉండే వారు కాదట. కేవలం ఓ 20 మంది టెక్నికల్‌ టీం మాత్రమే ఉండేవారట. షూటింగ్‌ చాలా కష్టంగా చేశామని.. ఏనుగులతో చేసే సీన్స్‌ కోసం చాలా టేక్స్‌ చేయాల్సి వచ్చిందని రానా అన్నాడు. ఈ చిత్రం ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Tags:    

Similar News