• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రానా-తేజ సినిమా.. కొత్త...

రానా-తేజ సినిమా.. కొత్త సంగతులు

By - Tupaki Desk
Update: 2017-01-30 11:32 GMT
పుష్కర కాలం నుంచి సక్సెస్ కోసం దండయాత్ర చేస్తున్నాడు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ. కానీ ఆయన ప్రయత్నం ఫలించడం లేదు. తేజ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపవుతున్నాయి. చివరగా ఆయన తీసిన ‘హోరాహోరీ’ గురించి చాలా చెప్పాడు కానీ.. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. ఆయన ట్రాక్ రికార్డు చూసి రానా లాంటి క్రేజీ హీరో సినిమా చేయడానికి ముందుకు రావడం.. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత సినిమాను నిర్మించడం విశేషమే. ఈ ముగ్గురి కాంబినేషన్లో రాబోతున్న సినిమానే.. ‘నేనే రాజు నేనే మంత్రి’. కాజల్ కథానాయికగా నటిస్తోంది ఇందులో.

ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి రానా రోడ్డు మీద ర్యాలీగా వెళ్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ అన్న టైటిల్.. ఈ ఫొటో చూస్తే ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అని అర్థమైపోయింది. స్వయంగా రానానే ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. తాను ఈ చిత్రంలో యువ రాజకీయ నాయకుడి పాత్ర చేస్తున్నట్లు తెలిపాడు. ఐతే తన తొలి సినిమా ‘లీడర్’తో పోలిస్తే ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని రానా చెప్పాడు. అనంతపురం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని రానా వెల్లడించాడు. ఇది ఒక రకంగా బయోపిక్ తరహా సినిమా అని.. కాకపోతే కథంతా కల్పితమేనని.. ఎవరినీ ఉద్దేశించింది కాదని చెప్పాడు. సమకాలీన రాజకీయాల ప్రస్తావన ఈ సినిమాలో ఉంటుందన్నాడు. రానా చెబుతున్న మాటలు సినిమా మీద ఆసక్తి రేకెత్తించేవే. మరి తేజ ఏదైనా యువ నాయకుడిని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా తీశాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Rana 
  • Nene Raju Nene Mantri 

Similar News

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS