రాజ‌మౌళిః ఎవ్వరి ఇంటికెళ్లినా.. ఏదో ఒక‌టి జేబులో తోసేస్తాడట‌!

Update: 2021-06-06 00:30 GMT
తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే కాదు.. ఇండియ‌న్ సెల్యులాయిడ్ పైనా రాజ‌మౌళిది ప్ర‌త్యేక సంత‌కం. అలాంటి రాజ‌మౌళికి చెక్కుపై స‌రిగా సంత‌కం చేయ‌డం రాదంటే న‌మ్ముతారా? సినిమాను తెరకెక్కించేప్పుడు ఎక్కడా ఏ చిన్న‌లోపం కూడా లేకుండా చూసుకునే జ‌క్క‌న్న‌.. చిన్న చిన్న‌విష‌యాలు కూడా మ‌రిచిపోతుంటారంటే అంగీక‌రిస్తారా? ఖ‌చ్చితంగా న‌మ్మే తీరాలంటున్నారు ఆయ‌న స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి. ఈ మ‌ధ్య ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళికి సంబంధించిన ఇన్ సైడ్ సీక్రెట్స్ అన్నీ బ‌య‌ట పెట్టేశారు.

సినిమా విష‌యంలో ఎంతో నిక్క‌చ్చిగా ఉంటారు రాజ‌మౌళి. ప‌ర్ఫెక్ష‌న్ కోసం ఎంత‌గానో త‌పించే ఆయ‌న‌.. సిన్సియారిటీ విష‌యంలోనూ అలాగే ఉంటారు. ఆన్ లొకేష‌న్లో అన్నీ ప‌ద్ధ‌తి ప్ర‌కారం న‌డిచిపోవాల‌ని కోరుకుంటారు. అయితే.. ఇంటికి వెళ్తే మాత్రం లెక్క మొత్తం మారిపోతుంద‌ట‌. చిన్న పిల్లాడిలా మారిపోయి ఎంజ‌య్ చేస్తుంటార‌ట‌.

ఇక‌, ఎవ‌రి ఇంటికైనా వెళ్లాడంటే.. మాట‌ల్లో ప‌డిపోయి ఏదో ఒక‌టి జేబులో పెట్టుకొని వ‌చ్చేస్తుండ‌టా. ఆ విధంగా ఒక ఇంట్లో నుంచి టీవీ రిమోట్‌, మ‌రో ఇంట్లో నుంచి కార్ తాళాలు తీసుకొచ్చారట‌. అంతేకాదు.. ఇంట్లోని వ‌స్తువులు కూడా జేబులో పెట్టుకొని వెళ్తుంటార‌ట‌. దీంతో.. ఇంట్లో ఏదైనా వ‌స్తువు క‌నిపించ‌క‌పోతే.. అంద‌రూ రాజ‌మౌళి వైపే వేలు చూపిస్తార‌ని న‌వ్వుతూ చెప్పారు ర‌మా.

రాజ‌మౌళి ప్ర‌తీ సినిమాకు ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అది సినిమా బ‌డ్జెట్లోనే భారీ వాటాగా ఉంటుంది. అంత‌లా రెమ్యున‌రేష‌న్ తీసుకున్న జ‌క్క‌న్న‌.. ఇంట్లో మాత్రం డ‌బ్బుల గురించి ప‌ట్టించుకోడ‌ట‌. ఎవ‌రితోనైనా లంచ్ కు వెళ్లాల్సి వ‌స్తే.. ప‌క్క‌వారే బిల్లు క‌ట్టాల్సి వ‌స్తుంద‌ని న‌వ్వేశారు ర‌మా రాజ‌మౌళి. అందుకే.. డ్రైవ‌ర్ కు డ‌బ్బులు ఇచ్చి పంపిస్తుంటాన‌ని చెప్పారు.

అంతేకాదు.. చెక్కుల‌పై ఒకేవిధంగా సంత‌కం చేయ‌డం కూడా రాద‌ని, ఒక్కోసారి ఒక్కోవిధంగా సంత‌కం చేయ‌డంతో.. అప్పుడ‌ప్పుడూ బౌన్స్ అవుతుంటాయ‌ని కూడా చెప్పారు ర‌మా రాజ‌మౌళి. మొత్తానికి ద‌ర్శ‌క‌ధీరుడిగా వెలిగిపోతున్న రాజ‌మౌళి.. ఇంట్లో మాత్రం స‌గ‌టు భ‌ర్త‌గా, తండ్రిగా సాధార‌ణ జీవితం గ‌డుపుతుంటార‌ట‌.
Tags:    

Similar News