HIV వ‌స్తుంది జాగ్ర‌త్త .. అవాక్క‌య్యేలా హీరోయిన్‌కి బెదిరింపు!

త‌న ప్రియుడితో తిరుగుతున్న స‌ద‌రు హీరోయిన్‌కి హెచ్.ఐ.వి వ‌స్తుంద‌ని నేరుగా వార్నింగ్ ఇచ్చింది.;

Update: 2026-01-15 05:53 GMT

ఇటీవ‌లి కాలంలో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ గ్యాంగ్ స్ట‌ర్ ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోని ద‌డ పుట్టించేలా బెదిరించాడు. కృష్ణ జింక‌ను చంపిన కేసులో గ్యాంగ్ స్ట‌ర్ స‌ద‌రు స్టార్ హీరోని వెంటాడుతుంటే, అది సినిమా క‌థ‌ను మించిపోయిందంటూ కామెంట్లు వినిపించాయి. హీరోగారికి, ఆయ‌న కుటుంబానికి సెక్యూరిటీ కోస‌మే వంద‌ల కోట్లు ఖ‌ర్చ‌వుతుంటే అది జ‌నంలో చ‌ర్చ‌గా మారింది. బుల్లెట్ ప్రూఫ్ కార్ల కోసం, బుల్లెట్ ప్రూఫ్ బాల్క‌నీ కోసం అత‌డు చాలా ఖ‌ర్చు చేసాడు.

అదంతా స‌రే కానీ, ఇప్పుడు ప్ర‌ముఖ గాయ‌కుడు పాపుల‌ర్ బాలీవుడ్ క‌థానాయిక బ‌హిరంగంగా త‌మ డేటింగ్ గురించి హింట్ ఇస్తుంటే, దానిని త‌ట్టుకోలేని స‌ద‌రు గాయ‌కుడి మాజీ ప్రేయ‌సి ఇచ్చిన వార్నింగ్ అవాక్క‌య్యేలా చేసింది. త‌న ప్రియుడితో తిరుగుతున్న స‌ద‌రు హీరోయిన్‌కి హెచ్.ఐ.వి వ‌స్తుంద‌ని నేరుగా వార్నింగ్ ఇచ్చింది. హెచ్.ఐ.వితో పాటు ఎస్టీడీ వంటి సుఖ వ్యాధులు సంక్ర‌మిస్తాయి.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌! అంటూ నేరుగా వార్నింగ్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం సృష్టించింది.

స‌ద‌రు గాయ‌కుడు త‌న కొత్త ప్రేయ‌సి అయిన ప్ర‌ముఖ హీరోయిన్ తో ఇటీవ‌ల స్టార్ స్ట‌డ్ వెడ్డింగ్ ఈవెంట్లో క‌నిపించాడు. అలా క‌నిపించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో వైర‌ల్ అయిన గంట‌లోనే స‌ద‌రు గాయ‌కుడి మాజీ ప్రేయ‌సి లైమ్ లైట్ లోకొచ్చింది. అంతేకాదు... అత‌డితో తిరిగితే హెచ్.ఐ.వి, ఎస్టీడీ సుఖ వ్యాధులు గ్యారెంటీ.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా హెచ్చ‌రించింది. అత‌డి పేరును మెన్ష‌న్ చేయ‌కుండానే, ఇలా ప్రేయ‌సి బెదిరించ‌డంతో ఇప్పుడు అది అంత‌టా గుస‌గుస‌ల‌కు కార‌ణ‌మైంది.

స‌ద‌రు గాయ‌కుడు మ‌గువ‌ల‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడ‌నే అర్థం ఈ బెదిరింపులోనే దాగి ఉంది. ఈ బెదిరింపు గురించి తెలుసుకోగానే, ఇది గ్యాంగ్ స్ట‌ర్ బెదిరింపును మించిపోయింది! అంటూ నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు. త‌న క‌ళ్ల ముందే త‌న ప్రియుడు వేరొక‌రితో బ‌హిరంగంగా షికార్లు చేస్తుంటే అది క‌డుపు మంట ర‌గిలించ‌కుండా ఉంటుందా? అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ప్రియురాలు బెదిరింపు మ‌రో లెవ‌ల్లో తాకుతోంద‌ని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. మీ మాజీ ప్రేయసి ఎప్పుడైనా మిమ్మ‌ల్ని కూడా ఇలానే బెదిరించిందా?

Tags:    

Similar News