మేనల్లుడి కోసం 18 కేజీలు తగ్గిన అమీర్ ఖాన్.. అసలు కథ ఏంటంటే?
సాధారణంగా ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ తెరపై అందంగా కనిపించాలి అంటే నాజూగ్గా ఉండాలని, ఫిట్ గా ఉండాలని అభిమానులు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు.;
సాధారణంగా ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ తెరపై అందంగా కనిపించాలి అంటే నాజూగ్గా ఉండాలని, ఫిట్ గా ఉండాలని అభిమానులు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి పాత్రలు డిమాండ్ చేస్తే కూడా భారీగా బరువు పెరగడమే కాదు బరువు తగ్గి నిరూపించిన హీరోలు, హీరోయిన్ లు కూడా ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. తన ప్రతి సినిమాకి తన మేకోవర్ ను మార్చుకోవడమే కాకుండా భారీగా బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమా కోసం ఆయన ఏ రేంజ్ లో బక్కచిక్కిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఇప్పుడు ఈయన దారిలోనే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో నిర్మాత అమీర్ ఖాన్ కూడా నడుస్తున్నారు అనే చెప్పాలి. ఆయన ఏకంగా తన మేనల్లుడి కోసం 18 కిలోల బరువు తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అయితే ఇది విన్న వారంతా మేనల్లుడి కోసం బరువు తగ్గడం ఏంటి? అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టు షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏకంగా 18 కేజీలు బరువు తగ్గినట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇదంతా తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హ్యాపీ పటేల్' సినిమా కోసమే అని తెలుస్తోంది.
ఈ సినిమాలో అమీర్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. పైగా ఈ సినిమాలో ఆయన ఒక కామెడీ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ పాత్ర కోసమే కొత్త డైట్ పాటిస్తున్నారట అమీర్ ఖాన్. అందులో భాగంగానే 18 కేజీలు బరువు తగ్గారట. పైగా ఇలా బరువు తగ్గడం వల్ల ఆయన ఈ అతిధి పాత్రలో నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ పాత్ర కోసం ఏకంగా 18 కిలోల బరువు తగ్గారని తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు అమీర్ ఖాన్ భారతదేశ సినీ పితామహుడుగా పేరు దక్కించుకున్న దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటిస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయితే మార్చి నెల నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్ కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన 3 ఇడియట్స్ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. అసలే 3 ఇడియట్స్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబో ఈ సీక్వెల్ తో మరో సంచలనం సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.