జైలర్ 2 లో విజయ్ సేతుపతి.. తన రోల్ పై కీలక కామెంట్స్!

జైలర్ 2 సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.;

Update: 2026-01-15 05:44 GMT

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒకప్పుడు కోలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఆ తర్వాత హీరోగా మారి భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. కోలీవుడ్ లోనే కాకుండా ఇటు తెలుగులో 'ఉప్పెన' సినిమాతో విలనిజం చూపించి.. అసలైన నటుడు అని నిరూపించుకున్నారు. హీరో గానే కాకుండా విలన్ గా కూడా సత్తా చాటుతూ దూసుకుపోతున్న విజయ్ సేతుపతి.. ఈమధ్య కీలక పాత్రలు పోషిస్తూ.. ఆయా సినిమాల సక్సెస్ లో భాగమవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు ఇతర స్టార్ హీరోల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తున్న విజయ్ సేతుపతి.. తాజాగా ప్రముఖ స్టార్ హీరో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ' జైలర్ 2' సినిమాలో తన పాత్ర గురించి అసలు విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

జైలర్ 2 సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ వార్తలను స్వయంగా ధ్రువీకరించారు విజయ్ సేతుపతి. ఆయన మాట్లాడుతూ.." నేను జైలర్ 2 లో అతిథి పాత్ర పోషిస్తున్నాను. ఎందుకంటే నాకు రజనీకాంత్ సార్ అంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆయనతో ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అందుకే నేను ఈ సినిమా చేస్తున్నాను. మన సూపర్ స్టార్స్ ఎన్నో దశాబ్దాలుగా ఈ సినీ పరిశ్రమలో మనుగడ సాగిస్తున్నారు. వారి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే ఈ సినిమాలో నేను భాగమయ్యాను" అంటూ తెలిపారు విజయ్ సేతుపతి

ప్రస్తుతం జైలర్ 2 సినిమా చివరి దశలో ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ , ఎస్ జె సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నామీనన్ , వినాయకన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే గతంలో వచ్చిన జైలర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2026 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది .

మరోవైపు ఈ సినిమా ఆగస్టులో విడుదల కాబోతోందని మేకర్స్ ప్రకటించినప్పుడు అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారనే చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది ఇదే ఆగస్టులో ఆయన నటించిన కూలీ సినిమా విడుదలైంది. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మళ్లీ అదే ఆగస్టులో జైలర్ 2 సినిమా విడుదల అంటే అసలు వర్క్ అవుట్ అవుతుందా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా సెంటిమెంటు రిపీట్ కాకూడదని కూడా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News