పండుగ వేళ మరింత సాంప్రదాయంగా ఆకట్టుకుంటున్న సప్తమి గౌడ!

ఈ క్రమంలోనే ఈరోజు సంక్రాంతి కావడంతో ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ప్రముఖ హీరోయిన్ సప్తమి గౌడ ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది.;

Update: 2026-01-14 23:30 GMT

ప్రస్తుతకాలంలో సెలబ్రిటీలు తమ నటనతోనే కాదు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.. అయితే సినిమాల ద్వారా ఆడియన్స్ కి, అభిమానులకు దగ్గర అవ్వడమే కాకుండా ఇటు సోషల్ మీడియాలో కూడా తమ అందాలతో అభిమానులకు దగ్గరవుతున్నారు. అలాగే అటు ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అకేషన్ ఏదైనా సరే అందంగా ముస్తాబయి ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సంక్రాంతి కావడంతో ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ప్రముఖ హీరోయిన్ సప్తమి గౌడ ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో తన అందంతో ఆకట్టుకోవడమే కాకుండా.. సాంప్రదాయంగా కనిపించి అందరి హృదయాలు దోచుకుంది.



 


కన్నడ సినీ పరిశ్రమలో ఎటువంటి అంచనాలు లేకుండా 2022లో విడుదలైన చిత్రం కాంతార. ఇందులో హీరోగా రిషబ్ శెట్టి నటించగా , హీరోయిన్ గా సప్తమి గౌడ నటించింది.. ఆ తర్వాత బాలీవుడ్ లో ది వ్యాక్సిన్ వర్క్ సినిమాలో కూడా నటించింది. ఈ క్రేజ్ తోనే తెలుగులో హీరో నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా డిజాస్టర్ మిగిలింది. కానీ సప్తమి గౌడ యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ తిరిగి మళ్ళీ తెలుగు సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం కన్నడలో ది రైస్ ఆఫ్ అశోక్ అనే చిత్రంలో నటిస్తోంది సప్తమి గౌడ.




 


నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలతో అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలకు సంబంధించి అలాగే హార్స్ రైడింగ్ తో పాటూ తన క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా సప్తమి గౌడ తన క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో లంగావోణీలో చాలా అందంగా కనిపిస్తూ చేతిలో పువ్వుతో చిరునవ్వు చిందిస్తూ హైలెట్గా నిలుస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం సప్తమి గౌడ అందం గురించి ఎంత పొగిడినా తక్కువే అంటూ అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




 


అయితే సప్తమి గౌడ ఈ ఫోటోలను తన ఇంటి దగ్గర దిగిందా లేకపోతే సినిమా షూటింగ్ సెట్లో దిగినవా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా సప్తమి గౌడ రాబోయే రోజుల్లో తెలుగులో కూడా పలు సినిమాలలో నటించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఈమెకు అవకాశాలు లభిస్తాయేమో చూడాలి



 


Tags:    

Similar News