పెళ్లి రిసెప్షన్‌లో ప్రియుడితో దొరికిపోయిన నటి
నుపుర్ సనన్ - స్టెబిన్ బెన్ వివాహ రిసెప్షన్ వేడుక ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది.;
నుపుర్ సనన్ - స్టెబిన్ బెన్ వివాహ రిసెప్షన్ వేడుక ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు తరలిరాగా, ముఖ్యంగా దిశా పటాని తన కొత్త బాయ్‌ఫ్రెండ్ అయిన గాయకుడు తల్విందర్ తో కలిసి జంటగా రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
గత కొంతకాలంగా దిశా పటాని సింగర్ తల్విందర్‌తో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రిసెప్షన్‌కు వీరిద్దరూ కలిసి రావడం ద్వారా తమ రిలేషన్‌షిప్‌ను దాదాపు ధృవీకరించారని గుసగుసలు మొదలయ్యాయి. విందు కార్యక్రమంలో దిశా పటాని మిరుమిట్ల సీక్విన్డ్ లెహంగాలో గ్లామరస్‌గా కనిపించగా, తల్విందర్ తనదైన సిగ్నేచర్ స్టైల్‌లో (మాస్క్ .. గ్లాసెస్‌తో) స్టైలిష్‌గా కనిపించారు. వీరిద్దరూ కెమెరాలకు ఫోజులివ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదే వేడుకకు దిశా పటానీ స్నేహితురాలు మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి హాజరయ్యారు. మౌనీ రాయ్ సాంప్రదాయబద్ధమైన సిల్క్ శారీలో దేవతలా కనిపించారు. నుపుర్ - స్టెబిన్‌లతో మౌనీకి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ రిసెప్షన్ లో చాలా ఉత్సాహంగా కనిపించారు. ఈవెంట్లో పెళ్లికూతురు నుపుర్ అక్క కృతి సనన్ మెరూన్ రంగు గౌనులో మెరిసిపోయారు. అతిథులందరినీ దగ్గరుండి కృతి స్వయంగా ఆహ్వానించారు. సింగర్ అర్మాన్ మాలిక్, నీతి మోహన్ తదితర సంగీత ప్రపంచానికి చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రిసెప్షన్ లో స్టెబిన్ బెన్ - తల్విందర్ కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అతిథులను అలరించినట్లు సమాచారం. ముఖ్యంగా నుపుర్ కోసం స్టెబిన్ పాడిన రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నుపుర్ - స్టెబిన్ జంటకు ఇది ఒక మధురమైన జ్ఞాపకం. ఈవెంట్లో దిశా పటాని - తల్విందర్ జంటకు ఇది ఒక కొత్త ఆరంభం అని భావించాలి.
దిశా పటానీ ఇంతకుముందు టైగర్ ష్రాఫ్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫిట్నెస్ కోచ్ అలెక్స్ ఇలిక్ తో సంబంధంలో ఉందని ప్రచారమైంది. కానీ దానిని ఆ జంట అధికారికంగా ధృవీకరించలేదు. దిశా ఇంతకుముందు ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రంలో నటించింది. తదుపరి సీక్వెల్ లో కనిపిస్తుందేమో చూడాలి.
ఓ రోమియో, వెల్ కం టు ది జంగిల్, అవారపాన్ 2, సంఘమిత్ర చిత్రాలు విడుదలకు రావాల్సి ఉంది.