టాలీవుడ్ లో ఒక‌టి కావ‌డం జ‌ర‌గ‌నిది

Update: 2020-06-06 04:30 GMT
కొంద‌రికి కిక్కు ఎక్కితేనే నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. కానీ ఏ కిక్కు ఎక్క‌కుండానే నిజాల్ని చెప్పేయ‌డం వ‌ర్మ‌కే చెల్లింది. నోటికి ఏది తోస్తే అది మాట్లాడేయ‌రు ఆయ‌న‌. తాను చూసిన‌ ఇండ‌స్ట్రీ నిజాల్ని ఆయ‌న ఫ్లోలో ఓపెన్ గానే చెప్పేస్తుంటారు. ఆ ప్లోలోనే ఆయ‌న ఇండస్ట్రీలో అందరూ ఒకటి కావడం అంటే పెద్ద బూతు అన్న నిజాన్ని చెప్పేశారు.

ఇక్క‌డ ఎవ‌రి కుంప‌టి వాళ్ల‌దే. క‌ళామ‌త‌ల్లి ఒడిలో అంద‌రూ ఒక‌టి కావ‌డం జ‌ర‌గ‌నిది. ఇక్కడ వేరు వేరు సినిమాలు వేరు వేరు ప్రాజెక్టులు. ఒకరంటే మరొకరికి పడదు అని అన్నారు ఆర్జీవీ. క‌లిసి ప‌ని చేద్దామ‌ని పెట్టే మీటింగుల‌న్నీ వృధానే. కాఫీ టీలు తాగ‌డం త‌ప్ప నిర్ణ‌యం తీసుకోలేర‌ని దెప్పి పొడిచారు.

ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వంతో చిరంజీవి మీటింగుల‌పైనా ఆయ‌న త‌న‌కు తెలీకుండానే సెటైర్ వేసేశారు. అయినా షూటింగుల్లో జాగ్ర‌త్త‌లా?  లొకేష‌న్ లో పోలీసులను పెడ‌తారా?   గార్డుల‌ను నియోగిస్తారా? అదంతా ఉత్తుత్తే. జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారా లేదా? అన్న‌ది ఎవ‌రు చూస్తారు? ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకుపోతుంటారు! అంటూ ఒక న‌గ్న‌స‌త్యాన్ని బ‌య‌ట‌పెట్టారు. సీట్లు తగ్గించి టిక్కెట్టు రేటు పెంచితే జనం థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అంటూ అనుమానం వ్య‌క్తం చేశారు. అలాగే డాక్యుమెంట‌రీల్ని ఆధారం చేసుకుని గాడ్సేపై సినిమా తీస్తాన‌ని గాంధీని కించ‌ప‌ర‌చ‌న‌ని కూడా ఆర్జీవీ చెప్పారు.

ప‌రిశ్ర‌మ విష‌యంలోనే ఆయ‌న సాఫ్ట్ గా నిజాల్ని చెప్ప‌డం ఆలోచించ‌ద‌గ్గ‌ది. ఇక్క‌డ ఎవ‌రి దుకాణం వారిదే. క‌లిసిక‌ట్టుగా ఒక మాట‌పై నిల‌బ‌డ‌డం ఒకే తాటిపైకి రావడం అన్న‌ది జ‌ర‌గ‌ని పని. ఇండ‌స్ట్రీ బ‌ల‌వంతుడిది. వాళ్లు ఆడేదే ఆట అనే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు ఆర్జీవీ న‌ర్మ‌గ‌ర్భంగా..
Tags:    

Similar News