భార‌తదేశంలో ఉన్న మొత్తం సినీ ప‌రిశ్ర‌మ‌లు?

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సినిమాలు నిర్మించే దేశంగా భార‌త్ కు పేరుంది. దేశంలో భాష‌, ప్రాంతం ఆధారంగా సుమారు 20-25 సినీ ప‌రిశ్ర‌మ‌లున్నాయ‌న్న‌ది అంచ‌నా.;

Update: 2026-02-27 12:30 GMT

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సినిమాలు నిర్మించే దేశంగా భార‌త్ కు పేరుంది. దేశంలో భాష‌, ప్రాంతం ఆధారంగా సుమారు 20-25 సినీ ప‌రిశ్ర‌మ‌లున్నాయ‌న్న‌ది అంచ‌నా. కానీ సినిమా నిర్మాణం అంటే హైలైట్ ద‌క్షిణాది-ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌లే. సౌత్ ప‌రంగా చూస్తే తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళ భాష‌లే క‌నిపిస్తాయి. ఉత్త‌రాది అంటే హిందీ ప‌రిశ్ర‌మ ఒక్క‌టే హైలైట్ అవుతుంది. వీటితో పాటు మ‌రాఠీ, భోజ్ పురీ ఇండ‌స్ట్రీ పేర్లు వినిపిస్తుంటాయి. ఓ సారి వాటి వివ‌రాల్లోకి వెళ్తే టాలీవుడ్ అంటే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌. ప్ర‌స్తుతం వ‌సూళ్ల ప‌రంగా దేశంలో టాప్ లో ఉంది.

సాంకేతిక ప‌రంగానూ అంత‌కంత‌కు టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటుంది. బాలీవుడ్ హిందీ ప‌రిశ్ర‌మ ముంబై కేంద్రంగా న‌డుస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతిపెద్ద పరిశ్రమ. ఒక‌ప్పుడు దేశంలో నెంబ‌ర్ వ‌న్ ఇండ‌స్ట్రీగా ఉండేది. టాలీవుడ్ సినిమాలు హిందీ సినిమా రికార్డుల‌ను బీట్ చేయ‌డంతో స్థానాలు మారాయి. త‌మిళ‌నాడు నుంచి కోలీవుడ్ తిరుగులేని ఇండ‌స్ట్రీ. సౌత్ లో సినిమాకు పుట్టినిల్లుగా త‌మిళ ప‌రిశ్ర‌మ‌ను భావిస్తుంటారు. వినూత్న ప్రయోగాలు , మాస్ సినిమాలకు పెట్టింది పేరు. మాలీవుడ్ మల‌యాళ ప‌రిశ్ర‌మ‌.

కాన్సెప్ట్ బేస్ట్ చిత్రాలు..అవార్డు విన్నింగ్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా కొన‌సాగుతోంది. స‌హ‌జ‌త్వం, బ‌ల‌మైన క‌థా బ‌లం ఉన్న చిత్రాల‌కు ప్ర‌సిద్ది. శాండిల్ వుడ్ క‌న్న‌డ ప‌రిశ్ర‌మ ఈ ఐదేళ్ల కాలంగా వెలుగులోకి వచ్చిన ప‌రిశ్ర‌మ‌. పాన్ ఇండియాలో క‌న్న‌డ సినిమాలు స‌క్సెస్ అవ్వ‌డంతో? దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అక్క‌డ నుంచి భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిత‌మ‌వుతున్నాయి. వీటితో పాటు మ‌రికొన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భార‌త్ లో నెల‌కొన్నాయి.

బెంగాలీ సినిమా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రానికి చెందింది. కోల్ క‌త్తా టోలీగంజ్ కేంద్రంగా ప‌ని చేస్తోంది.

ఈ ప‌రిశ్ర‌మ‌ను కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. తెలుగు ఇండ‌స్ట్రీ పేరునే క‌లిగి ఉండ‌టం ఇంట్రెస్టింగ్. పంజాబీ సినిమా పంజాబ్ లో, గుజ‌రాతీ సినిమా గుజ‌రాత్ లో నెలకొన్నాయి. బోజ్పురీ ఇండ‌స్ట్రీ బిహార్-ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో క‌ల‌దు. వీట‌న్నింటిని క‌లిపి ప్రాంతీయ ప‌రిశ్ర‌మ‌లుగా పిలుస్తుంటారు. ఇత‌ర చిన్న మాండ‌లిక ప‌రిశ్ర‌మ‌లు కొన్ని ఉన్నాయి.

ఒడియా సినిమా ఓలీవుడ్ ఒడిశాలో, అస్సామీ సినిమా జాలీవుడ్ అస్సాంలో క‌ల‌వు. ఇంకా మ‌ణిపురీ సినిమా మ‌ణిపూర్ లో, తుళు సినిమా క‌ర్ణాట‌క కోస్తా ప్రాంతంలో క‌ల‌దు. కొంక‌ణి సినిమా గోవాలో ఉంది. కాశ్మీరీ, డోగ్రీ, రాజ‌స్థానీ, హ‌ర్యాన్వీ భాష‌ల్లో కూడా సినిమాలు నిర్మిత‌మ‌వుతున్నాయి. గ‌తేడాది గ‌ణాంకాల ప్ర‌కారం అత్య‌ధిక థియేట‌ర్ల ఆదాయం,బాక్సాఫీస్ వాటాలో టాలీవుడ్ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది.

Tags:    

Similar News