హీరోయిన్ల కెరీర్ కు వేస‌వి ప‌రీక్ష‌!

వ‌రుస వైఫ‌ల్యాల‌తో నిరుత్సాహం ఎంత‌టి వారికైనా త‌ప్ప‌దు. కానీ ఆ ఫేజ్ నుంచి బ‌య‌ట ప‌డ‌ట‌మే కీల‌కం.;

Update: 2026-02-27 11:30 GMT

వ‌రుస వైఫ‌ల్యాల‌తో నిరుత్సాహం ఎంత‌టి వారికైనా త‌ప్ప‌దు. కానీ ఆ ఫేజ్ నుంచి బ‌య‌ట ప‌డ‌ట‌మే కీల‌కం. ఆ స‌మ‌యంలో తీసుకునే నిర్ణ‌యాల‌తో పాటు, అదృష్టం కూడా క‌లిసొస్తేనే అందుకు అవ‌కాశం ఉంటుంది. తాజాగా ఓ న‌లుగురు భామ‌ల విష‌యంలో ఇదే స‌న్నివేశం క‌నిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు హీరోయిన్ శ్రీలీల వ‌రుస ప్లాప్ ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు న‌టించిన‌ `రాబిన్ హుడ్`, `జూనియ‌ర్`, `మాస్ జాత‌ర‌` బ్యాక్ టూ బ్యాక్ ఫెయి ల్యూర్స్ గా నిలిచాయి. దీంతో చేతిలో ఉన్న `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` హిట్ తో రేసులో నిల‌వాల‌ని ఆశ‌ప‌డుతోంది.

ఇదే సినిమాతో రాశీఖ‌న్నా కూడా రేసులో నిల‌వాల‌ని భావిస్తోంది. కొంత కాలంగా తెలుగు సినిమాల‌కు దూరంగా ఉన్న అమ్మ‌డికి రాక‌రాక‌ వ‌చ్చిన అవ‌కాశం. అందులోనూ ప‌వ‌న్ తో సినిమా కావ‌డంతో స‌క్సెస్ అవుతుంద‌నే ఆశ‌తో ఎదురు చూస్తోంది. ఇలా ఈ విజ‌యం ఇద్ద‌రి భామ‌ల కెరీర్ ట‌ర్నింగ్ కి ఎంతో కీల‌కంగా మారింది. కెరీర్ ప‌రంగా మ‌ళ్లీ పుంజుకోవాలంటే స‌క్సెస్ ఒక్క‌టే దారి. స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముదుకు రాబోతుంది. మూడేళ్ల‌గా తెలుగు సినిమాలు లేక ఖాళీగా ఉన్న మాలీవుడ్ బ్యూటీ మాళ‌విక నాయ‌ర్ `బైక‌ర్` తో కంబ్యాక్ అవ్వాల‌ని ఎ దురు చూస్తోంది.

ఇందులో అమ్మ‌డు శ‌ర్వానంద్ కు జోడీగా న‌టించింది. `బైక‌ర్` రిజ‌ల్ట్ విష‌యంలో శ‌ర్వానంద్ కాన్పిడెన్స్ ఏ లెవ‌ల్లో ఉంద‌న్న‌ది ఇటీవ‌లే అత‌డి మాట‌ల్లో బ‌య‌ట ప‌డింది. దీంతో మాళివిక నాయ‌ర్ లో ఆశ‌లు రెట్టింపు అయ్యాయి.

`బైక‌ర్` తో మ‌ళ్లీ టాలీవుడ్ లో బిజీ అవ్వాల‌ని ఆశ ప‌డుతోంది. ఏప్రిల్ 3న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అలాగే న‌భా న‌టేష్ `మ్యాస్ట్రో` త‌ర్వాత మ‌ళ్లీ మూడేళ్ల‌కు `డార్లింగ్స్` లో న‌టించింది. ఇది రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన చిత్రం. ఈ సినిమా కూడా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. దీంతో న‌భా టాలీవుడ్ కెరీర్ ముగిసింద‌నుకునే త‌రుణంలో నిఖిల్ క‌రుణించాడు.

అత‌డు హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `స్వ‌యంభూ`లో ఛాన్స్ ఇచ్చాడు. న‌భాకెరీర్ లో మ‌రో గొప్ప అవ‌కాశం ఇది. సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దీంతో న‌భాలో ఆశ‌లు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాతో హిట్ అందుకుని తిరిగి అవ‌కాశాలు అందుకోవాల‌ని ఎదురు చూస్తోంది. అలాగే `నాగబంధం` సినిమాలోనూ అమ్మ‌డు పార్వ‌తి పాత్ర‌తో మెప్పించ‌డానికి రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలు కూడా వేస‌వి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే స‌మంత `ఖుషీ` త‌ర్వాత తెలుగు తెర‌పై క‌నిపించింది లేదు.

దీంతో `మా ఇంటి బంగారం` పైనే ఆశ‌ల‌న్నీ. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం స‌మ్మ‌ర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా స‌మంత‌కు కీల‌క‌మైంది. హిట్ అయితేనే కొత్త అవ‌కాశాల‌కు ఛాన్స్ ఉంది. లేదంటే ప్ర‌తికూల ప‌రిస్థితులు త‌ప్ప‌వు. ముంబై బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇంత వ‌ర‌కూ బోణీనే కొట్ట‌లేదు. దీంతో ఆశ‌ల‌న్నీ `లెనిన్` పైనే పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే? భాగ్య శ్రీకి అవ‌కాశాలు. లేదంటే? క‌ష్ట‌మ‌నే మాట ఇండస్ట్రీలో బ‌లంగా వినిపిస్తోంది. ఈ రెండు చిత్రాలు కూడా స‌మ్మ‌ర్ లోనే రిలీజ్ చేస్తున్నారు.

Tags:    

Similar News