డెకాయిట్ 'రుబరూ'.. ఎలా ఉందంటే..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్లు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబోలో రూపొందుతున్న మూవీ డెకాయిట్.;

Update: 2026-02-27 12:12 GMT

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్లు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబోలో రూపొందుతున్న మూవీ డెకాయిట్. హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఆ మూవీ.. తెలుగు- హిందీ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.



 


అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించి యాక్షన్‌ ‌ను పరిచయం చేసి మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్‌.. ఇప్పుడు హార్ట్‌ ఫెల్ట్ రొమాన్స్‌ తో సినిమా మ్యూజికల్ జర్నీని మొదలుపెట్టారు. టీజర్, గ్లింప్స్‌ తో హైప్ తీసుకొచ్చిన మేకర్స్.. మ్యూజిక్ ప్రమోషన్స్‌ లో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ రుబరూను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి రీసెంట్ గా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేసి.. సాంగ్ కోసం అందరూ వెయిట్ చేసేలా చేశారు మేకర్స్. మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని అంటుంది మనసే.. అంటూ సాగుతున్న ఆ పాట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. డెకాయిట్ ఫస్ట్ సింగిల్ కు భాస్కర్ భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. చిన్మయి శ్రీపాదతో కలిసి ఆయన ఆలపించడం విశేషం.

ఇక సాంగ్ కచ్చితంగా చార్ట్ బస్టర్ గా నిలిచేలా కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో అడివి శేష్- మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ మాత్రం ఫుల్ గా వర్కౌట్ అయినట్టు క్లియర్ గా సాంగ్ ద్వారా తెలుస్తోంది. మృణాల్ తన లుక్ తో ఫిదా చేస్తున్నారు. శేష్ కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. పాటలోని విజువల్స్ చాలా నేచురల్ గా ఉండి అందరినీ ఓ రేంజ్ లో మెప్పిస్తున్నాయి.

అదే సమయంలో భీమ్స్ సిసిరోలియో రొమాంటిక్ ట్యూన్ తో సాంగ్ ను కంపోజ్ చేశారు. చిన్మయితోపాటు ఆయన గాత్రం కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. రవికుమార్ లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సాంగ్ బాగుందని ఇప్పుడు నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఎంతో కూల్ గా ఉంటూ.. అట్రాక్ట్ చేస్తుందని.. చివర్లో ఎమోషనల్ గా ఉందని చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తుండటం విశేషం. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖ పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్‌ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


Full View


Tags:    

Similar News