సీక్వెల్ సినిమాలో క్రేజీ క్యామియోలు
క్రియేటివ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన డెబ్యూ సినిమా ఈ నగరానికి ఏమైంది మూవీతోనే మంచి పునాదిని సెట్ చేసుకున్నారు.;
క్రియేటివ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన డెబ్యూ సినిమా ఈ నగరానికి ఏమైంది మూవీతోనే మంచి పునాదిని సెట్ చేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో పెద్ద హిట్ కాకపోయినా, తర్వాత జెన్ జెడ్ ఆడియన్స్ లో క్లాసిక్ గా మిగిలింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని ఎక్కువ సీన్స్ మీమ్ కల్చర్ లోకి రావడంతో ప్రతీ సీన్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయింది. ఈ సినిమాతో విశ్వక్ కు కూడా టాలీవుడ్ లో మంచి స్థాయి, గుర్తింపు లభించాయి.
డైరెక్టర్ గా కనిపించనున్న విశ్వక్ సేన్
ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజైనప్పటి నుంచే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందంటున్నారు కానీ ఇప్పటివరకు వచ్చింది లేదు. అయితే రీసెంట్ గా ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ మూవీలో విశ్వక్ సేన్ ఒక పెద్ద డైరెక్టర్ పాత్రలో కనిపించనున్నారట. కథలో భాగంగా ఆయన ఎంతో మంది స్టార్ హీరోలు, డైరెక్టర్లతో కలుస్తూ, ఇండస్ట్రీలోనే బిజీగా ఉండే వ్యక్తిగా దర్శనమివ్వబోతున్నారట.
టాలీవుడ్ స్టార్ల క్యామియోలు
ఈ నేపథ్యంలోనే విశ్వక్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలైన బాలకృష్ణ, అక్కినేని నాగర్జున, విక్టరీ వెంకటేష్ తో పాటూ డైరెక్టర్లు మెహర్ రమేష్, సుజీత్ లాంటి ప్రముఖ డైరెక్టర్లను కూడా కలుస్తారని, కథ రియాలిటీగా ఉండాలని ఈ సీక్వెల్ లో వారితో క్యామియోలు చేయించాలని తరుణ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే వారి క్యామియోలు సినిమాకు ఉన్న హైప్ ను ఆకాశానికి అంటేలా చేయడం ఖాయం.
ఈసారి థాయ్‌లాండ్‌లో!
ఈ నగరానికి ఏమైంది మొదటి భాగం గోవాలో ఎక్కువగా షూటింగ్ చేసినప్పటికీ, ఈ సీక్వెల్ కోసం మేకర్స్ థాయ్‌లాండ్ ను లొకేషన్ గా ఎంచుకున్నారు. మొదటి భాగంలో గోవా వెళ్లి రచ్చ చేసిన ఫ్రెండ్స్ గ్రూప్ ఇప్పుడు బ్యాంకాక్ వెళ్లి వారు చిల్ అవుతూ, ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఈ మూవీలో ఉండబోయే కామెడీ, ఫ్రెండ్‌షిప్ రిలేటెడ్ కంటెంట్ ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలను పెంచుతోంది. ఇక తరుణ్ భాస్కర్ విషయానికొస్తే కేవలం డైరెక్టర్ గానే కాకుండా యాక్టింగ్ వైపు కూడా అడుగులేస్తూ వస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ నటించిన కొన్ని సినిమాలు కొన్ని విమర్శలు ఎదుర్కోవడంతో, ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఈ నగరానికి ఏమైంది2 పైనే పెట్టినట్టు తెలుస్తోంది.