ఆర్‌ ఆర్‌ ఆర్‌ కోసం రియల్‌ స్టార్స్‌ ను కలిసిన చరణ్‌

Update: 2020-05-04 06:45 GMT
ఒకప్పుడు హీరోలు ఏడాదికి డజన్లకొద్ది సినిమాలు చేసేవారు. అప్పట్లో కొందరు స్టార్లు ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. కాని ఇప్పుడు హీరోలు అలా కాదు. ముఖ్యంగా స్టార్‌ హీరోలు ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరో సినిమా అన్నట్లుగా ప్లాన్‌ చేసుకుంటున్నారు.

ఇక పాత హీరోలతో పోల్చితే ప్రస్తుత హీరోలు ఒక్కో సినిమాకు ఒక్కో రకంగా కనిపించేందుకు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డూప్‌ లతో మ్యానేజ్‌ చేయడం.. మేకప్‌ తో కవర్‌ చేయాలనుకోవడం లేదు. బాక్సింగ్‌ నేపథ్యం లో సినిమా చేయాలనుకుంటే మూడు నాలుగు నెలల పాటు బాక్సింగ్‌ పై కసరత్తులు చేస్తున్నారు. దేనిపై అయితే సినిమా అనుకుంటున్నారో వాటిపై పూర్తి అవగాహణను హీరోలు తెచ్చుకున్న తర్వాతే సినిమా షూటింగ్‌ కు వెళ్తున్నారు.

ఇక జక్కన్న సినిమాలో హీరోలు ముందస్తు ట్రైనింగ్స్‌ ఏ స్థాయిలో తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా ఏడాది కాలం ట్రైనింగ్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కోసం ఎన్టీఆర్‌.. చరణ్‌ లు చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఆ పాత్ర కోసం విలు విద్యను నేర్చుకోవడంతో పాటు కిక్‌ బాక్సింగ్‌ లో కూడా ట్రైనింగ్‌ తీసుకున్నాడట. బాక్సింగ్‌ కోసం రియల్‌ బాక్సింగ్‌ హీరోలను కలిసి వారి వద్ద ట్రైనింగ్‌ తీసుకున్నాడట.

రియల్‌ బాక్సర్స్‌ కులదీప్‌ సింగ్‌ మరియు నీరజ్‌ గొయాట్‌ ల వద్ద కిక్‌ బాక్సింగ్‌ కు సంబంధించిన టిప్స్‌ ను చరణ్‌ తీసుకున్నాడట. చరణ్‌ తో ఉన్న ఫొటోలను ఈ రియల్‌ హీరోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. చరణ్‌ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అనే విషయమై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు బాక్సర్‌ గా కూడా కనిపించబోతున్నాడా అంటూ అభిమానులు ఊహల్లో మునిగి పోయారు. మన్యం వీరుడిగానే కాకుండా పోలీస్‌ గా బాక్సర్‌ గా కూడా చరణ్‌ ను చూడబోతున్నామా అంటూ ఫ్యాన్స్‌ చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు.
Tags:    

Similar News