సర్దార్ 2 సాహసానికి మాళవిక సవాల్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాళవిక మోహనన్, తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.;
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాళవిక మోహనన్, తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. మలయాళ సినీ పరిశ్రమలో ప్రారంభమైన ఆమె ప్రయాణం, తమిళం, తెలుగు భాషల్లో విస్తరించి ఇప్పుడు పాన్ సౌత్ స్థాయికి చేరుకుంది. గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా, సవాళ్లతో కూడిన పాత్రలను ఎంచుకోవడంలో ఆమె చూపిస్తున్న ధైర్యం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
సర్దార్2లో నరాలు కదిలించే యాక్షన్ సీన్స్
ప్రస్తుతం మాళవిక నటిస్తున్న సర్దార్2లో తన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో ఆమెకు కొన్ని కూల్, ఛాలెంజింగ్ సీన్స్ ఉన్నాయని స్వయంగా మాళవికనే వెల్లడించారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్‌లు ప్రేక్షకుల నరాలు కదిలేలా ఉంటాయని, వాటి కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా హీరోలకే పరిమితమయ్యే హై ఆక్టేన్ సీన్స్ లో తాను భాగమవడం తనకు కొత్త అనుభవమని చెప్పారు.
యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్
సర్దార్2 మూవీలో తన క్యారెక్టర్ గత సినిమాల కంటే భిన్నంగా ఉండబోతుందని మాళవిక స్పష్టం చేశారు. ఈ మూవీలో శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా సిద్ధమవాల్సిన సీన్స్ ఉన్నాయని, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు ఆమె తెలిపారు. భారీ సెటప్‌ల మధ్య, టెక్నికల్‌గా కఠినమైన సీన్స్ లో నటించడం తనకొక పెద్ద సవాలుగా అనిపించిందని.. అయినప్పటికీ ఆ కష్టానికి ఫలితం తెరపై కనిపిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు మాళవిక.
సర్దార్‌కు సీక్వెల్ గా వస్తోన్న సర్దార్2
గ్లామర్‌కు మాత్రమే పరిమితమవకుండా ఎక్స్‌పెరిమెంటల్ క్యారెక్టర్లు చేయడమంటే తనకు ఇష్టమని, ప్రయోగాత్మక పాత్రలు చేసి ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే తన టార్గెట్ అని ఆమె చెప్తున్నారు. మాళవిక చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే సర్దార్2 లో తన పాత్ర ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్2 కు పి.ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తుండగా, 2022లో వచ్చిన సక్సెస్‌ఫుల్ మూవీ సర్దార్ కు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో పాకెట్ నావెల్ మూవీతో పాటూ పలు సినిమాలతో బిజీగా ఉన్న మాళవిక దృష్టి ప్రస్తుతం సర్దార్2 పైనే ఉందని తెలుస్తోంది. తానెంతో కష్టపడి చేసిన యాక్షన్ సీన్స్ ను ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారో అని తెలుసుకోవడానికి మాళవిక చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.