• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధృవ రికార్డులు టీజర్ తో...

ధృవ రికార్డులు టీజర్ తో మొదలయ్యాయ్

By - Tupaki Desk
Update: 2016-10-12 07:44 GMT
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ.. ఈ దసరాకే థియేటర్లలో రికార్డుల అంతు చూడాల్సింది కానీ.. షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉండడంతో.. ఇప్పటికి టీజర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సరిగ్గా విజయదశమి రోజు సాయంత్రం టీజర్ ను రిలీజ్ చేసింది ధృవ యూనిట్. అసలే స్టైలిష్ కాప్ డ్రామా. దీనికి తోడు సురేందర్ రెడ్డి లాంటి స్టైలిష్ డైరెక్టర్ కావడంతో.. టీజర్ చూస్తున్న ఫ్యాన్స్ అరుపులు కేకలే.


ధృవ టీజర్ ఫ్యాన్స్ కి ఎంతగా నచ్చేసిందంటే.. రిలీజ్ అయిన 17 గంటల్లోనే ఈ టీజర్ మిలియన్ వ్యూస్ దాటేసి రికార్డ్ సృష్టించేంసింది. ఇప్పటికే 24వేల లైక్స్ కూడా వచ్చేశాయి. చెర్రీ క్రేజ్ ముందు ఈ కౌంట్ తక్కువే కానీ.. కంప్లీట్ హాలిడే కం ఫెస్టివల్ మూడ్ లో జనాలు ఉన్నపుడు రిలీజ్ అయిన 24 గంటల్లోపే రికార్డులపై కన్నేయడం అంటే మాత్రం చిన్న విషయం కాదు.

ఇక ధృవ రికార్డుల మోత టీజర్ తో మొదలైందని.. డిసెంబర్ లో సినిమా థియేటర్లలోకి వచ్చాక మెగా పవర్ స్టార్ అసలు హంగామా మొదలవుతుందని.. మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ధీమాగా చెప్పేసుకుంటున్నారు. టీజర్ లుక్ చూస్తుంటే.. చెర్రీ ఈ సారి మాంచి కమాండింగ్ హిట్ కొట్టేట్టే ఉన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Ram 
  • Charan 
  • Dhruva 
  • Dhruva Movie 
  • Dhruva Teaser 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS