• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇస్మార్ట్ గిఫ్ట్ ఇచ్చిన...

ఇస్మార్ట్ గిఫ్ట్ ఇచ్చిన ఉస్తాద్!

By - Tupaki Desk
Update: 2019-09-30 15:20 GMT
చాలామందే డైరెక్టర్లు ఉంటారు కానీ పూరి జగన్నాధ్ మాత్రం ఒక స్పెషల్ లీగ్. డైరెక్టర్ గా పూరి కెరీర్ ముగిసిపోయిందని విమర్శకులు తీసిపారేసే సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ కావడం.. బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చూపడం పూరికి చాలా కామన్. రీసెంట్ గా 'ఇస్మార్ట్ శంకర్' తో అదేపని చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తను ఫాం లోకి రావడమే కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను కూడా సూపర్ ఫామ్ లోకి తీసుకొచ్చాడు.  దీంతో పూరి - రామ్ లు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

పూరి రీసెంట్ గా 28 వ తారీఖున తన పుట్టిన రోజు జరుపుకున్నారు.  ఇండస్ట్రీలో కూడా పూరి పుట్టినరోజు సందర్భంగా పూరికి శుభాకాంక్షలు  చెప్పడం లాంటి హడావుడి కనిపించింది. ఇక పూరి టీమ్ తరఫున ఛార్మీ కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోని వారికి నగదు సహాయం కూడా చేశారు. ఇదిలా ఉంటే ఈ పుట్టిన రోజు సందర్భంగా హీరో రామ్ పూరికి ఓ ఇస్మార్ట్ గిఫ్ట్ ఇచ్చారట. ఈ విషయాన్ని ఛార్మి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

"పూరి జగన్ కు మీరిచ్చిన అద్భుతమైన బర్త్ డే గిఫ్ట్ కు.. లవ్ యూ ఉస్తాద్ రామ్... జగన్ గారు ఆకాశంలో తేలిపోతున్నారు" అంటూ ట్వీట్ చేశారు ఛార్మీ. దీంతో పాటు ఆ బహుమతికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే హై క్వాలిటీ ఉండే గోల్డ్ ఫాంటమ్ వైర్ లేస్ స్పీకర్స్. ఈ స్పీకర్స్ ధర నాలుగు వేల డాలర్ల వరకూ ఉంటుంది.  ఛార్మీ షేర్ చేసిన వీడియోలో పూరి 'ఇస్మార్ట్ శంకర్' పాటలను ఈ స్పీకర్లలోనే వింటూ ఉత్సాహంగా కనిపించారు. ఏదేమైనా ఇస్మార్ట్ రామ్ టేస్టే వేరబ్బా!

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    
  • Ram 
  • Puri Jagannath 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS