• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'క్రాక్' డైరెక్టర్ తో...

'క్రాక్' డైరెక్టర్ తో మరోసారి రామ్?

By - Tupaki Desk
Update: 2021-07-04 12:30 GMT
ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో కథలను రెడీ చేసుకోవడంలో గోపీచంద్ మలినేని సిద్ధహస్తుడు. కథ ఎక్కడా నత్త నడక నడవకుండా చకచకా పరిగెడుతూ ఉంటుంది. కథనంలో ఆ వేగమే ఆయన సినిమాలకు ప్రధానమైన బలంగా నిలుస్తుంటుంది. ఆయన ఇంతకుముందు తెరకెక్కించిన సినిమాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి గోపీచంద్ మలినేని .. రామ్ హీరోగా మరో ప్రాజెక్టును సెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రామ్ .. లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగుతో పాటు తమిళంలోను విడుదల కానున్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా అలరించనుంది. కోలీవుడ్ లో లింగుస్వామికి మంచి క్రేజ్ ఉండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత రామ్ .. గోపీచంద్ మలినేని ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'పండగ చేస్కో' సూపర్ హిట్ గా  నిలిచింది. అందువలన కచ్చితంగా ఇది క్రేజీ కాంబినేషనే అవుతుంది. అయితే అధికారిక ప్రకటన వస్తేనేగానీ ఈ విషయాన్ని నమ్మలేం.

ఇటీవల 'క్రాక్' సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన గోపీచంద్ మలినేని, తన తాజా చిత్రాన్ని బాలయ్యతో ప్లాన్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ కథ నడుస్తుంది. బాలయ్య అభిమానులు ఆయన నుంచి ఆశించే పవర్ఫుల్ డైలాగులు ... మాస్ డాన్సులు .. ఫైట్లు పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 'సంక్రాంతి' బరిలోకి ఈ సినిమాను దింపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 
Tags:    
  • gopichand malineni 
  • gopichand malineni movies 
  • gopichand malineni krack 
  • rampothineni 
  • rampothineni movies 
  • pandagachesko 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS