ఎందుకీ తలకిందుల తపస్సు
ఎదిగే కొద్దీ తపన పెరుగుతుంది. తపన పెరిగే కొద్దీ శ్రమ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ కష్టం చూస్తుంటే అంతకుమించి అని అర్థమవుతోంది. ఈ అమ్మడిలో అన్ని కోణాల్లో ఎదిగే కొద్దీ తపన పెరుగుతోందే కానీ తరగడం లేదు. ఓ వైపు కథానాయికగా అంతకంతకు ఎదిగేస్తోంది. మరోవైపు జిమ్ బిజినెస్ లో ఎంటర్ ప్రెన్యూర్ గానూ ఎదిగే ప్రయత్నంలో ఉంది. రకుల్ ప్రతి ప్రణాళిక ఎంతో పకడ్భందీగానే ఉన్నాయి. ఎక్కడ ఏ అవకాశాన్ని ఎలా అంది పుచ్చుకోవాలో ఈ అమ్మడికి తెలిసింతగా ఇంకెవరికీ తెలియదేమో! అన్నంతగా పక్కా ప్లాన్ తో ఉంటోంది.
వీటన్నిటినీ మించి ఫిజికల్ ఫిట్ నెస్ - ఆరోగ్యం విషయంలో రకుల్ హార్డ్ వర్క్ ఏ స్థాయిలో ఉందో ఇటీవలి మేకోవర్ చెబుతోంది. రకుల్ ఉన్నట్టుండి బొద్దు లుక్‌ని వదిలి పూర్తిగా జీరోసైజ్ కి మారిపోతోంది. ఏజ్ పెరిగేకొద్దీ టీనేజీ లుక్ లోకి ట్రాన్స్ ఫామ్ అయిపోతోంది. అయితే అందుకు ఎంత హార్డ్ వర్క్ చేస్తోంది ఈ ఫోటోల్ని చూస్తే అర్థమవుతోంది. ఇంతగా తలకిందులు అయితేనే జీవితంలో ఎదగే ఛాన్సుంటుందా? అన్నంతగా ఆ శ్రమ చూస్తుంటే నోట మాట పడిపోవాల్సిందే ఎవరికైనా. జిమ్ - యోగా - ధ్యానం అన్నిటినీ మిక్స్ చేసి ఓ కొత్త రకం సాధన చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ తరహా యోగసాధనతో పూర్తి ప్రశాంత చిత్తతను పొందొచ్చని సెలవిస్తోంది.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు... మహా మనుషులవుతారు అనడానికి ఉదాహరణగా నిలుస్తోంది ఈ పంజాబీ బ్యూటీ. డాడ్ ఎలానూ సిక్కు మతాచారాలతో కూడుకున్న క్రమశిక్షణను అలవరిచారు కాబట్టి, అందుకు తగ్గట్టే ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు అది ఉపయోగపడుతోందన్న మాట. రకుల్ ఇప్పటికిప్పుడు అరడజను ప్రాజెక్టుల్లో నటిస్తోంది.