వావ్.. మెడికల్ షాపులో ఆల్కహాల్ కూడా అమ్ముతున్నారా...?
రకుల్ ప్రీత్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటుంది. తన వస్త్ర ధారణ విషయంలో.. వర్క్ ఔట్స్ వీడియోలతో నెటిజన్ల ట్రోలింగ్స్ రూపంలో రకుల్ ప్రీత్ ఫుల్ ఫేమస్ అవుతూ ఉంటుంది. అయితే రకుల్ కూడా అదే రేంజ్ లో ఇచ్చే సమాధానాలు కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. రకుల్ క్వారంటైన్ లో చేస్తున్న పనులు.. వర్క్ ఔట్స్ వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా రకుల్ ఒక సాధారణ అమ్మాయిలా బయటకు వచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుండి రోడ్లపై ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఈమె వీడియో వైరల్ అవుతుంది. అది చూసిన అభిమానులు ఆమెనా కాదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మొహానికి మాస్క్ కట్టుకుని ఉన్న రకుల్ ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణ యువతిలా అలా వచ్చేసరికి ఎవరూ ముందు గుర్తు పట్టలేదు. కానీ గుర్తు పట్టేసరికి పని చూసుకుని వెళ్లిపోయింది రకుల్. ఓ మెడికల్ షాపుకి వచ్చి తనకు కావాల్సిన మందులను తీసుకుని వెళ్ళిపోయింది రకుల్. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అక్కడే ఉన్న ఒకతను ఫోన్ లో వీడియోను షూట్ చేసాడు.
ఇక రకుల్ ఉన్న వీడియో తెగ వైరల్ కాగా.. ఆమె ఆల్కహాల్ కొనడానికి షాప్‌కు వెళ్లిందా.. అని కొన్ని మీడియాలలో వార్తలు రాశాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఒక వైన్ షాప్ వద్ద లిక్కర్ కొనుగోలు చేసిందంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి ఓ మెడికల్ షాప్ వద్ద రకుల్ ప్రీత్ సింగ్ మందులు కొనుగోలు చేసుకుని రోడ్డు దాటుతుండగా ఎవరో వీడియో తీశారని తరువాత తెలిసొచ్చింది. విచిత్రం ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ లో వైన్ షాప్ వద్ద అని కొంత మంది తమ పోస్టులలో పేర్కొంటున్నారు. వీటిపై రకుల్ ప్రీత్ సింగ్ సెటైరికల్ ట్వీట్ వేసింది. ''ఓ వావ్.. మెడికల్ షాపు వాళ్లు ఆల్కహాల్ అమ్ముతుంటారని నాకు తెలీదే..'' అంటూ ట్వీట్ చేసింది. ఇలాంటి వక్రీకరించే రూమర్స్ రకుల్ మీద క్రియేట్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు.. గతంలో కూడా చాలా సార్లు రకుల్ పై రూమర్స్ చాలానే వచ్చాయి.