మ‌హేష్‌పై ప్రొడ్యూస‌ర్ బాల‌కృష్ణ క్రేజీ కామెంట్స్‌!

సూప‌ర్ స్టార్ కృష్ణ ద‌ర్శ‌కుల డైరెక్ట‌ర్ అనే పేరుంది. డైరెక్ట‌ర్స్ విజ‌న్‌కు ప్రాధాన్య‌త‌నిచ్చి ఆయ‌న సినిమాలు చేస్తుండే వారు.;

Update: 2026-04-22 13:30 GMT

సూప‌ర్ స్టార్ కృష్ణ ద‌ర్శ‌కుల డైరెక్ట‌ర్ అనే పేరుంది. డైరెక్ట‌ర్స్ విజ‌న్‌కు ప్రాధాన్య‌త‌నిచ్చి ఆయ‌న సినిమాలు చేస్తుండే వారు. క్ర‌మ శిక్ష‌ణ‌కు, ప‌వ‌ర్ ఫుల్ న‌ట‌న‌కు మారు పేరుగా నిలిచి డైరెక్ట‌ర్స్ హీరో అనిపించుకున్నారు. ఒక సంద‌ర్భంలో నాలుగు షిఫ్ట్‌లు ఎలాంటి విరామం లేకుండా న‌టించిన న‌టుడిగా కృష్ణ‌కు తిరుగులేని రికార్డ్ ఉంది. అలాంటి న‌టుడి కుమారుడిగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కూడా అదే పేరుని సార్థ‌కం తీసుకుంటూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నారు.

`పోకిరి`తో ఇండ‌స్ట్రీ రికార్డుల్ని తిర‌గ‌రాసి తెలుగు సినిమా స‌త్తా ఏంటో చూపించిన మ‌హేష్ ఇప్ప‌టికీ డైరెక్ట‌ర్స్ హీరోనే అనే పేరుంది. డైరెక్ట‌ర్ విజ‌న్‌ని న‌మ్మి సినిమాలు చేస్తుంటారు మ‌హేష్‌. ప్ర‌స్తుతం పాన్ ఇండియా క్రేజీ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకోవ‌డ‌మే కాకుండా టాలీవుడ్ స్థాయిని, మార్కెట్‌ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లిన రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్నారు. మైథ‌లాజిక‌ల్ అంశాల‌కు సైన్స్‌ని జోడించి అత్యంత భారీ స్థాయిలో ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అనే పంథాలో ఈ మూవీరి తెర‌పైకి తీసుకొస్తున్నారు.

గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమార‌న్, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. హాలీవుడ్ దిగ్గ‌జాలు సైతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్పాన్ ఉన్న మూవీ కావ‌డంతో దీని ప్ర‌మోష‌న్స్‌ని ఇప్ప‌టికే మొద‌లు పెట్టిన జ‌క్క‌న్న ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నాడు. షూటింగ్ పూర్తి కాకుండానే ప్ర‌మోష‌న్స్‌ని గ‌ట్టిగానే ప్లాన్ చేస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీపై క్రేజ్‌ని పెంచేస్తున్నాడు.

ఇందులో మ‌హేష్ రుద్ర‌గా, త్రేతాయుగం ఎపిసోడ్‌లో రాముడిగా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇంత‌కీ హ‌ను మంతుడిగా ఎవ‌రు క‌నిపిస్తార‌నే దానిపై మాత్రం జ‌క్క‌న్న ఇప్ప‌టికీ క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా వుంటే హీరో మ‌హేష్‌పై నిర్మాత బాల‌కృష్ణ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌ధాన్య‌త‌ను సంతరించుకుంది. తేజ డైరెక్ట్ చేసిన `నిజం` సినిమాలో మ‌హేష్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ టైమ్ నుంచి మ‌హేష్‌ని చూస్తున్నాన‌ని తెలిపిన బాల‌కృష్ణ అప్ప‌టికీ ఇప్ప‌టికీ త‌న‌లో యాక్టింగ్ ప‌రంగా ఎలాంటి మార్పు క‌నిపించ‌లేద‌న్నారు.

నిజం టు వార‌ణాసి మ‌హేష్‌లో ఎలాంటి మార్పు రాలేదు. షూటింగ్ బ్రేక్‌ల స‌మ‌యంలో డ‌ల్‌గా క‌నిపించే మ‌హేష్ యాక్ష‌న్, టేక్ అన‌గానే టైగ‌ర్‌లా మారిపోతాడ‌ని, ఊహించ‌ని జోష్‌తో న‌టిస్తాడ‌ని, నిజం నుంచి ఇప్ప‌టికీ త‌న‌లో అదే క‌నిపిస్తోంద‌ని, త‌ను ఎక్క‌డా మార‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా మ‌హేష్ తండ్రి అల‌వాటు చేసిన క్ర‌మ‌శిక్ష‌ణ‌ని ఫాలో అవుతున్నాడ‌ని, దాన్ని ఇప్ప‌టికీ విడిచిపెట్ట‌లేద‌ని అన్నారు నిర్మాత బాల‌కృష్ణ .

Tags:    

Similar News