'బిగినింగ్ ఎవరూ మార్చలేరు' అంటున్న స్టార్ హీరోయిన్!!

Update: 2021-01-04 09:23 GMT
ఇండస్ట్రీలో కెరీర్ మొదలైన తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్‌ సింగ్. తెలుగులో దాదాపు యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి సరసన రొమాన్స్ చేసింది. చివరిగా కింగ్ నాగార్జున మన్మధుడు-2 మూవీలో నటించి ప్లాప్ అందుకుంది. అప్పటి నుండి ఈ భామ బాగా స్లో అయ్యింది. వరుస ప్లాపులు తట్టుకోలేక బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన అమ్మడికి సౌత్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం అమ్మడి చేతిలో తెలుగు, తమళ, హిందీ సినిమాలు ఉన్నాయట. తెలుగులో అయితే డైరెక్టర్ క్రిష్ మూవీతో పాటు నితిన్ సరసన చెక్ మూవీలో నటిస్తోంది. ఈ భామ ప్రస్తుతం చేస్తున్న సినిమాల పైనే భారీ ఆశలు పెట్టుకుందట. మొన్నా మధ్య హీరో సూర్యతో కలిసి 'ఎన్.జి.కె' సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.

ఆ తర్వాత కార్తీతో దేవ్ అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా బెడిసి కొట్టడంతో కెరీర్ పరంగా సందిగ్ధంలో పడింది. ఎట్టకేలకు స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'భారతీయుడు-2' సినిమాలో అవకాశం ఇచ్చాడు. కానీ ఆ సినిమాలో రకుల్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే అమ్మడు శివకార్తికేయన్ 'అయలన్' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ప్లాప్ లలో ఉన్నా రకుల్ కి అవకాశాలు మాత్రం అడపాదడపా వస్తూనే ఉన్నాయి. ఇక అమ్మడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తాజాగా ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ కి కిక్కిస్తూ ఉంటుంది. అయితే తాజాగా రకుల్ పోస్ట్ చేసిన పిక్ తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అమ్మడు బ్లాక్ అండ్ వైట్ పోజు కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా 'మీరు వెనక్కి వెళ్లి మీ బిగినింగ్ మార్చలేరు. కానీ మీ ఎండింగ్ మాత్రం కొత్తగా స్టార్ట్ చేయొచ్చు' అంటూ నోట్ కూడా పెట్టింది. అంతే ఢిల్లీ భామకు ఫిదా అయిపోయి లైక్ షేర్ అంటున్నారు నెటిజన్లు.
Tags:    

Similar News