బ్రేకింగ్ న్యూస్: అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రజినీకాంత్

Update: 2020-12-25 08:18 GMT
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అన్నాతే' యూనిట్ లో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్ లో ఇద్దరు సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో  అర్థాంతరంగా చిత్రీకరణ నిలిపివేశారు. అయితే హీరో రజినీకాంత్ కి మాత్రం కరోనా నెగెటివ్ గా వచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక రజినీకాంత్ కూడా హైదరాబాద్ నుంచి చెన్నై కి బయలుడానికి సన్నద్ధం అవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి రజినీ హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అవడంతో ఆయన అభిమానులు కలవరపాటుకు లోనయ్యారు. దీంతో అపోలో ఆసుపత్రి యాజమాన్యం తాజాగా రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

''రజినీకాంత్ ఈ రోజు ఉదయం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత పది రోజులుగా ఆయన హైద్రాబాద్ లో  సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే సెట్స్ లో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రజినీకాంత్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయనకి డిసెంబర్ 22న చేసిన కరోనా టెస్ట్ లో నెగిటివ్ అని వచ్చింది. రజినీకాంత్ కి కరోనా లక్షణాలు కనిపించనప్పటికీ ఆయన బ్లడ్ ప్రెజర్(బీపీ)లో హెచ్చు తగ్గులు కనిపించడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన బీపీ నార్మల్ స్టేజికి వచ్చే వరకు హాస్పిటల్ సిబ్బంది క్లోజ్ గా మానిటర్ చేస్తారు. అతని ఆరోగ్యం స్టేబుల్ గా ఉంది. బ్లడ్ ప్రెజర్ లో హెచ్చుతగ్గులు తప్ప రజినీకాంత్ కి ఎలాంటి ఇతర లక్షణాలు కనిపించలేదు" అని అపోలో యాజమాన్యం పత్రికా ప్రకటనలో పేర్కొంది.
Tags:    

Similar News