భజరంగీ కథ బన్నీదా?!
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన `భజరంగీ భాయ్ జాన్` వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. బాలీవుడ్ లో `బాహుబలి`ని సైతం మరిపించింది. రెండే రెండు రోజుల్లో రూః 150కోట్ల కు పైగా వసూళ్ల ను కొల్లగొట్టింది. `బాహుబలి`కి కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాదే `భజరంగీ భాయ్ జాన్`కి కథని అందించడం విశేషం. రెండు కథలు సూపర్ హిట్ అవ్వడంతో విజయేంద్రప్రసాద్ పేరు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మార్మోగిపోతోంది. సల్మాన్ ఖాన్ నటించిన `భజరంగీ... ` కథని మొదట మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిందట. కానీ ఎందుకో ఆ కథకి నేను కనెక్ట్ అవ్వడం లేదు అని చెప్పాడట బన్నీ. దీంతో ఆ కథని టాలీవుడ్ లోనే ఇద్దరు ముగ్గురు కథానాయకులకు వినిపించారని సమచారం. వాళ్లు కూడా `తర్వాత చూద్దాం` అన్నట్టు మాట్లాడారట.
ఆ తర్వాత ఇదే కథని రజనీకాంత్ కూడా విన్నట్టు తెలిసింది. ఆయన కూడా మళ్లీ చూద్దాం అని చెప్పారట. దీంతో కథ అలా అలా బాలీవుడ్ వరకు వెళ్లింది. అక్కడ అమీర్ ఖాన్ ఈ కథ విని ఓకే చెప్పారట. అయితే డేట్లు సర్దుబాటు కాకపోవడంతో సినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఆ వెంటనే కబీర్ ఖాన్ ఈ కథని సల్మాన్ ఖాన్ కి వినిపించడం, ఆయన ఓకే అనడం చకచకా జరిగిపోయాయి. అంటే అల్లు అర్జున్ చేయాల్సిన ఆ కథ అచ్చం ఆంజనేయుడు గాల్లో ఎగిరినట్టుగా బాలీవుడ్ కి వెళ్లిపోయింన్నమాట. ఏమైతేనేం... సల్మాన్ నటించడంతో ఇప్పుడా కథని దేశం మొత్తం చూస్తోంది.