'జెర్సీ' బ్యూటీ టాలీవుడ్ కి అందుకే దూరంగా!
ఈ క్రమంలోనే `జెర్సీ` విడుదలైన తర్వాత టాలీవుడ్ కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిలో దాదాపు నాలుగైదు సినిమాలను ఆమె నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినట్లు తాజాగా రవీల్ చేసింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `జెర్సీ` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్ భావోద్వేగపూరిత నటనకు విమర్శకుల నుంచి ప్రేక్షకుల వరకు విశేష ప్రశంసలు లభించాయి. సాధారణంగా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలకు అవకాశాలు వెల్లువెత్తుతాయి. అయితే శ్రద్ధా విషయంలో మాత్రం సినిమాల సంఖ్య పెంచుకోవడం కంటే? ఆ పాత్రల్లో ఉండే బరువు బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. పాటలకే పరిమితమయ్యే గ్లామరస్ క్యారెక్టర్ల కంటే తనలోని నటిని కొత్తగా ఆవిష్కరించే విభిన్నమైన పాత్రలనే ఎంచుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే `జెర్సీ` విడుదలైన తర్వాత టాలీవుడ్ కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిలో దాదాపు నాలుగైదు సినిమాలను ఆమె నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినట్లు తాజాగా రవీల్ చేసింది. కథలు విన్నప్పుడు పాత్రకు సరైన ప్రాధాన్యత లేదని, కేవలం హీరో పక్కన గ్లామర్ బొమ్మగా నిలబెట్టడానికే ఆ పాత్రలను డిజైన్ చేశారని గ్రహించి వాటిని వదులుకున్నానని శ్రద్ధ స్పష్టం చేసింది. ఆఫర్లు రావడం ముఖ్యం కాదని.. చేసే క్యారెక్టర్ సినిమా పూర్తయ్యాక కూడా ప్రేక్షకులకు ఎంతవరకు గుర్తుండిపోతుందనేదే కీలకమని అభిప్రాయపడింది.
తెలుగులో తాను అనుకున్న స్థాయి బలమైన పాత్రలు రాకపోవడంతో శ్రద్ధ తన దృష్టిని మాలీవుడ్ వైపు మళ్లించింది. మలయాళ చిత్రసీమలో కథాంశాలు, పాత్రల రూపురేఖలు శ్రద్ధా ఆలోచనలకు తగినట్లుగా ఉండటంతో అక్కడ వరుస అవకాశాలు తలుపు తట్టాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే వైవిధ్యమైన పాత్రలు దక్కుతుండటంతో మాలీవుడ్‌లో కన్నడ బ్యూటీ బిజీగా ఉంది. అక్కడ నటనకు ప్రాధాన్యమున్న ప్రాజెక్టులు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
ప్రస్తుత ఇండస్ట్రీలో కథానాయికల ప్రాముఖ్యత గ్లామర్ డోస్ ఇవ్వడానికో లేక కమర్షియల్ హంగులు అద్దడానికో పరిమితం కాకూడదని శ్రద్ధా శ్రీనాథ్ గట్టిగా నమ్ముతోంది. ఎంత చిన్న పాత్ర చేసినా ? ఆ సినిమా కథాగమనంలో దాని ప్రభావం బలంగా ఉండాలని ఆశిస్తోంది. కథానాయికలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని కోరుకునే నటీమణులకు శ్రద్ధా తీసుకుంటున్న నిర్ణయం చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. సినిమాల సంఖ్య తగ్గినా పర్వాలేదు కానీ నటిగా ఆత్మసంతృప్తికే మొదటి ప్రాధాన్యం అని శ్రద్ధా నిలబడటం ప్రశంసించదగిన విషయం.
ఏది ఏమైనా? సరైన కథ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు లభిస్తే టాలీవుడ్‌కు తిరిగి రావడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటానని శ్రద్ధా ఆశాభావం వ్యక్తం చేసింది. స్క్రీన్ ప్రజెన్స్ కోసం కాకుండా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే బలమైన క్యారెక్టర్ దక్కితేనే తెలుగు తెరపై మళ్లీ అడుగుపెడతానని స్పష్టం చేసింది. నటనపై నిబద్ధత ఉన్న శ్రద్ధా శ్రీనాథ్ వంటి ప్రతిభావంతురాలైన నటి కోసం టాలీవుడ్ దర్శకులు వైవిధ్యమైన కథలతో ముందుకు వస్తారని.. ఆమె నుంచి మరో అద్భుతమైన పాత్రను తెలుగు ప్రేక్షకులు చూస్తారని ఆశిద్దాం.