బాలయ్య ఆ జానర్ లో సినిమాలు చేయడు...ఒకవేళ చేస్తే ఇండస్ట్రీ షేక్ అవుతుందా...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళ ఇమేజ్ ను పక్కన పెట్టి డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Update: 2026-09-19 14:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళ ఇమేజ్ ను పక్కన పెట్టి డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు లాంటి నటుడు సైత గతంలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేశాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' లాంటి హిస్టారికల్ మూవీ చేసిన తర్వాత ఆయన మరోసారి అలాంటి ప్రయత్నం అయితే చేయలేదు. నిజానికి ఆయన దగ్గరికి అలాంటి సబ్జెక్టులు రావడం లేదు. డిఫరెంట్ సబ్జెక్టుతో బాలయ్య దగ్గరికి వెళ్తే మాత్రం ఆయన తప్పకుండా చేస్తాడు. ఇక బాలయ్య ప్రస్తుతం కమర్షియల్ ఫార్మాట్లోనే మూవీస్ చేస్తు ముందుకు సాగుతున్నాడు. ఆ మూవీస్ అయితేనే ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉంటాడనే ఉద్దేశ్యంతో ఆయన అలాంటి మూవీస్ ను ఎంచుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా బాలయ్య ఒక రెండు జానర్స్ లో సినిమాలు చేస్తే చూడాలని అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ బాలయ్య బాబు చేయాల్సిన జానర్స్ ఏంటి అంటే కామెడీ జానర్ లో ఆయన ఇప్పటివరకు పెద్దగా చెయ్యలేదు బాబాయ్ అబ్బాయి అనే ఒక సినిమా గుర్తు ఉంటుంది. కొన్ని తప్పితే తను చేసిన సినిమాల్లో అడపదడప కామెడీ ఉంది కానీ ఆయన ఇప్పటి వరకు ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ ని పోషించలేదు. కామెడీ ప్రాధాన్యం ఉన్న ఒక సినిమా చేస్తే బాగుంటుంది.

బాలయ్య కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ జనరేషన్ కి తగ్గట్టుగా బాలయ్య ఒక కామెడీ స్క్రిప్ట్ ను డిజైన్ చేయించుకొని మూవీ చేస్తే ఆ సినిమా పక్కాగా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయగలుగుతుంది. ఇక అలాగే ఒక పుల్ లెంత్ థ్రిల్లర్ సినిమాలో కూడా బాలయ్య నటించలేదు. కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళను మెప్పించేలా అలాంటి సినిమాను కూడా డిజైన్ చేస్తే బాగుంటుంది.

డిఫరెంట్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాలయ్యలోని పూర్తిస్థాయి నటుడు మరోసారి బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య సబ్జెక్ట్ ని ఒక్కసారి ఓకే చేశాడు అంటే ఆ స్క్రిప్టుకి ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సరే వాటన్నింటిని అధిగమించుకొని మరి సినిమాని పూర్తి చేస్తాడు. బాలయ్య కామెడీ జోనర్లో అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేస్తే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి బాలయ్య పక్కాగా అలాంటి సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అభిమానుల కోరిక మేరకు బాలయ్య రాబోయే రోజుల్లో ఇలాంటి స్క్రిప్టులు డిజైన్ చేయించుకొని సినిమాలు చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది...

Tags:    

Similar News