కూల్ లవ్ స్టోరీ, సాలిడ్ యాక్షన్.. 'ఇట్లు అర్జున' టీజర్ ఎలా ఉంది?

యంగ్ అండ్ టాలెంటెడ్ క్యాస్టింగ్ అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఆ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తే కొత్త కాన్సెప్ట్‌ తో సినిమా తెరకెక్కించినట్లు క్లియర్ గా అర్థమవుతోంది.

Update: 2026-09-19 12:32 GMT

సాధారణంగా సినిమా అంటే ప్రేమ.. యాక్షన్.. కామెడీ.. ఇవన్నీ కామన్. కానీ హీరోకు మాటలు రావు.. అదే హీరోకు కొన్ని సీక్రెట్ పవర్స్ ఉంటే.. ఆ స్టోరీ ఎలా ఉంటుందో చూపించబోతోంది ఇట్లు అర్జున. యంగ్ అండ్ టాలెంటెడ్ క్యాస్టింగ్ అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఆ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తే కొత్త కాన్సెప్ట్‌ తో సినిమా తెరకెక్కించినట్లు క్లియర్ గా అర్థమవుతోంది.

ఛలో, భీష్మ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఇట్లు అర్జున సినిమాకు నిర్మాతగా మారారు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న ఆ చిత్రంతో మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనీష్ హీరోగా ఇట్లు అర్జునతోనే టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇస్తుండగా.. అనస్వర రాజన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. టీజర్‌ లో ముందుగా హీరో రోల్ ఇంట్రెస్ట్ పెంచుతోంది. అర్జున్‌ కు మాటలు రావు.

అయితే అతడి దగ్గర సాధారణ మనిషికి లేని కొన్ని పవర్స్ ఉన్నట్లు చూపించారు. మాటలు లేకపోయినా తన చుట్టూ జరిగే విషయాలపై అతడు ఎలా రెస్పాండ్ అవుతాడు.. తనలో ఉన్న పవర్స్ ను ఎలా యూజ్ చేస్తాడన్నది సినిమాలో మెయిన్ గా ఉండబోతున్నట్లు టీజర్ హింట్ ఇచ్చింది. దీంతో ఇట్లు అర్జున మూవీలో హీరో రోల్ నార్మల్ లవ్ స్టోరీ హీరోలా కాకుండా సరికొత్తగా కనిపిస్తోంది.

మరోవైపు అనస్వర రాజన్ రోల్ కు మంచి స్కోప్ ఉన్నట్లు కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ చాలా కూల్ గా, నేచురల్ గా ఉన్నాయి. వీరిద్దరి మధ్య ప్రేమకథ సినిమాకు మరో మెయిన్ అట్రాక్షన్ గా ఉండబోతున్నట్లు టీజర్ చెబుతోంది. ప్రేమతో పాటు యాక్షన్ సీన్స్ కూడా కథలో స్ట్రాంగ్ కలిపినట్లు కనిపిస్తోంది. టీజర్‌ కు ఇంకో ప్రత్యేక ఆకర్షణ కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్.

ఆయన వాయిస్ టీజర్‌ కు మరింత స్ట్రెంత్ ను తీసుకొచ్చింది. ముఖ్యంగా హీరో పాత్రను పరిచయం చేసే విధానంలో ఆ వాయిస్ ఓవర్ ఆసక్తిని పెంచుతోంది. సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్‌ లో హైలైట్‌ గా నిలిచింది. యాక్షన్ సీన్లలో వచ్చే మ్యూజిక్‌ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో వినిపించే స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా రిచ్‌ గా కనిపిస్తున్నాయి.

అలా ప్రేమకథకు సూపర్ హీరో ఎలిమెంట్స్‌ ను యాడ్ చేసి ఇట్లు అర్జున మూవీని కొత్తగా రూపొందిస్తున్నట్లు టీజర్‌ తో దాదాపు సినీ ప్రియులకు క్లారిటీ వచ్చింది. ఇక మూవీలో హీరోకు మాటలు లేకపోవడం.. అతడిలో ఉన్న శక్తులు.. నాగార్జున వాయిస్ ఓవర్.. తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి సరికొత్త అర్జున కథ థియేటర్లలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూడాలి.


Full View


Tags:    

Similar News