• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ ను...

మెగాస్టార్ ను గుర్తుకుతెస్తున్న సూపర్ స్టార్

By - Tupaki Desk
Update: 2015-11-05 17:30 GMT
ఇక్కడ మెగాస్టార్ అంటే మన చిరంజీవి కాదు. మన చిరు కంటే ముందు ఇండియా లెవెల్లో మెగాస్టార్ అనిపించుకున్న అమితాబ్ బచ్చన్. ఇక సూపర్ స్టార్ అంటే సూపర్ స్టారే.. రజినీకాంత్ అన్నమాట. తన కొత్త  సినిమా ‘కబాలి’ విషయంలో అమితాబ్ బచ్చన్‌ నే గుర్తుకు తెస్తున్నాడు రజినీ. ఆ గెటప్ చూసినా.. ‘కబాలి’ కథాంశం గురించి వస్తున్న వార్తలు చదువుతున్నా అమితాబ్ నటించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ అనే సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి.

కొన్నేళ్ల పాటు మాఫియా సామ్రాజ్యానికి దూరంగా ఉండి.. మళ్లీ ఆ ఫీల్డ్ లోకి వచ్చిన డాన్ కథతో మన పూరి జగన్నాథ్ తీసిన సినిమా ‘బుడ్డా హోగా తేరా బాప్’. అందులో వయసుకు తగ్గ పాత్రలో చెలరేగిపోయాడు అమితాబ్. తెల్ల గడ్డంతోనే రియలిస్టిక్ గా అనిపించే గెటప్ లో, తనదైన స్టయిల్ మేనరిజమ్స్ తో మెస్మరైజ్ చేశాడు మెగాస్టార్. ఇప్పడు రజినీ కూడా ఇలాగే కనిపిస్తున్నాడు. ‘కబాలి’లో సూపర్ స్టార్ గెటప్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అమితాబ్ లాగే తెల్లటి గడ్డంతో, తనదైన స్టయిల్ తో దర్శనమిస్తున్నాడు రజినీ.

ఇక ‘కబాలి’ కథాంశం కూడా ‘బుడ్డా..’కు కొంచెం దగ్గరగా ఉంది. మాఫియా సామ్రాజ్యానికి దూరమైన డాన్.. తన కూతుర్ని కాపాడుకోవడం కోసం మళ్లీ ‘డాన్’గా మారే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందట. కాకపోతే ‘బుడ్డా..’ తరహాలో ఇందులో కామెడీ ఉండదు. రజినీ సీరియస్ గానే కనిపిస్తాడు. సినిమా మొదలైనపుడు పెద్దగా హైప్ లేదు కానీ.. ఈ మధ్య రజినీ పోస్టర్ల హంగామా తర్వాత మాత్రం ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేసింది ఈ సినిమాకు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Tags:    
  • Rajinikanth 
  • Kabali 
  • Amitabh Bachchan 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS