ఇండియన్స్ కోసమే సినిమాలన్న రాజమౌళి

Update: 2019-02-23 06:50 GMT
బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనుకునేలా టాలీవుడ్ చరిత్రను మార్చి రాసిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో తలమునకలై ఉన్నాడు `ఇటీవలే హార్వర్డ్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన జక్కన్న అక్కడి ఆహుతులు అడిగిన ప్రశ్నలకు చాలా సుదీర్ఘమైన సమాధానాలు ఇచ్చాడు . జాతీయ స్థాయితో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో హిట్టు కొట్టారు కదా మరి ఇంగ్లీష్ సినిమా ఏదైనా తీసే ఉద్దేశం ఏదైనా ఉందా అంటే దానికి చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు.

బాహుబలి తీసే టైంలో దాన్ని జపాన్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తీయలేదని మనసులో సౌత్ వాళ్ళే ఉన్నారని అయితే ప్రయత్నంలో నిజాయితి ఉండటం జనరంజకమైన అంశాలు లోటు లేకపోవడం వల్ల విదేశాల్లో సైతం పెద్ద హిట్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు. భారతీయ సినిమాలు ఇక్కడి ఎమోషన్స్ మీదే ఆధారపడి రూపొందుతాయని భవిష్యతులో తన కథలు వీటి మీదే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసారు.

ఆర్ ఆర్ ఆర్ గురించి ఎక్కువ మాట్లాడకుండా స్మార్ట్ గా తప్పించుకున్న రాజమౌళి టైం వచ్చినప్పుడు ఏ రహస్యాలు దాచనని కుండ బద్దలు కొట్టేసారు. వర్తమాన రాజకీయాల గురించి కూడా మాట్లాడిన జక్కన్న ప్రజలు డబ్బు తీసుకుని ఒటేసినంత కాలం రాజకీయాల్లో మార్పు రావడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ఇదొక్కటే కాదు చాప కింద నీరులా విస్తరిస్తున్న డిజిటల్ విప్లవం వల్ల కొత్త సినిమాలు నెల రోజులకే చిన్న తెరలపై ప్రత్యక్షం కావడం గురించి మాట్లాడుతూ ఈ ప్రక్రియను సమర్ధించడం విశేషం. కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు ఖచ్చితంగా థియేటర్ కు వచ్చి తీరతాడని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి రకరకాల విషయాల గురించి రాజమౌళి ఇచ్చిన వివరణ అక్కడి వాళ్ళకు ఒక పుస్తకంలా ఉపయోగపడింది అనడంలో ఆశ్చర్యం లేదు
   

Tags:    

Similar News