బతికుండగానే చనిపోయినట్లు వార్తలు.. హీరోయిన్ కన్నీళ్లు

సినీ ఇండస్ట్రీలో చాలా మంది బ్యూటీలు.. కొన్ని సినిమాలు చేశాక కనుమరుగవుతుంటారు.

Update: 2024-05-06 14:30 GMT

సినీ ఇండస్ట్రీలో చాలా మంది బ్యూటీలు.. కొన్ని సినిమాలు చేశాక కనుమరుగవుతుంటారు. అందం, అభినయంతో సినీ ప్రియులను అలరించిన ముద్దుగుమ్మలు.. ఒకట్రెండు సినిమాలు చేశాక బిజినెస్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరికొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమవుతున్నారు. ఇంకొందరు వేరే కారణాలతో సినిమాలకు బై చెబుతున్నారు. అలా కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ముద్దుగుమ్మల్లో భావన ఒకరు.

శ్రీకాంత్ మహాత్మ సినిమాలో నీలపూరి గాజుల ఓ నీలవేణి సాంగ్.. వింటే టక్కున గుర్తు వచ్చేస్తుంది భావన. ఆ మూవీతో పాటు జగడం, పగ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగులో తక్కువ సినిమాలు చేసినా.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ పర్లేదు అనుకుంటున్న సమయంలో ఓ హీరో తనను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారాయి. తనపై కావాలనే కొందరు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని భావన ఆవేదన వ్యక్తం చేసింది. తాను బతికుండగానే చనిపోయానని రూమర్లు స్ప్రెడ్ చేశారని చెప్పింది.

అప్పట్లో తన అబార్షన్ గురించి వచ్చిన రూమర్స్‌ పై కూడా క్లారిటీ ఇచ్చింది భావన. అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని, ఆ తర్వాత కూడా తనకు పలుమార్లు గర్భస్రావం అయిందని తప్పుడు వార్తలు ప్రచారం చేశారని చెప్పింది. చాలా మందితో తనకు ఎఫైర్స్ ఉన్నాయని కామెంట్ చేశారని తెలిపింది. ఆ రూమర్లను ఇప్పుడు గుర్తుచేసుకుంటే చిరాకు వస్తుందని, వాటి వల్ల మెంటల్‌ గా చాలా డిస్ట్రబ్ అయ్యానని చెప్పింది. కానీ ఇప్పుడు స్ట్రాంగ్‌ గా నిలబడ్డానని అని భావన తెలిపింది.

ఇక 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది భావన. పెళ్లి తర్వాత భర్త అండతో బాగున్నానని తెలిపింది. ఆమె నటించిన మలయాళం మూవీ నడిగర్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. టాలీవుడ్ ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. ఎన్టికక్కకురు ప్రేమందార్న్ అనే మరో మూవీలో కూడా యాక్ట్ చేస్తోంది భావన. మరి ఆమె... తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News