పిక్ టాక్ : ఇస్మార్ట్‌ చాప్లిన్ బ్యూటీ బ్యూటీ

చార్లీ చాప్లిన్‌ గొప్పతనం గురించి నభా ఇన్‌ స్టా లో ఈ ఫోటోలతో పాటు పోస్ట్‌ చేసి ఆయన అభిమానులను అలరించింది.

Update: 2024-05-06 14:55 GMT


ఏ భాష కు చెందిన కమెడియన్స్ అయినా ఏదో ఒక సందర్భంలో చార్లీ చాప్లిన్‌ వేషధారణ తో కనిపించాలని అనుకుంటారు. ప్రపంచ ప్రసిద్ది గాంచిన కామెడీ స్టార్‌ చార్లీ చాప్లిన్‌ ను కోట్లాది మంది అభిమానిస్తారు. ఆయన చనిపోయి అయిదు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా ఆయనను జనాలు మర్చి పోలేదు.





 



అలాంటి చార్లీ చాప్లిన్‌ ను మరోసారి కళ్ల ముందుకు తీసుకు వచ్చినట్లుగా ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్ మేకోవర్‌ తో సోషల్‌ మీడియాలో సందడి చేసింది. బ్లాక్‌ బ్లేజర్‌ మరియు మ్యాచింగ్ ప్యాంట్‌ తో పాటు చార్లీ క్యాప్‌ ను ధరించింది. అంతే కాకుండా చాప్లిన్‌ సిగ్నేచర్‌ ఫోజ్ లు ఇచ్చింది.



సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. నిజంగా ముద్దుగుమ్మ నభా నటేష్ సూపర్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో ఫోటో షూట్‌ కి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ అమ్మడు మాత్రం చాలా స్పెషల్‌ అంటూ నిరూపించుకుంది.



చార్లీ చాప్లిన్‌ గొప్పతనం గురించి నభా ఇన్‌ స్టా లో ఈ ఫోటోలతో పాటు పోస్ట్‌ చేసి ఆయన అభిమానులను అలరించింది. ప్రపంచ ప్రసిద్ది గాంచిన చార్లీ అవతార్‌ లో గతంలో కూడా చాలా మంది కనిపించారు. అయితే ముద్దుగుమ్మ ఇలా చార్లీ గెటప్ లో అనేది చాలా కొత్తగా ఉందని నెటిజన్స్ అంటున్నారు.



ఇక నభా నటేష్ సినిమాల విషయానికి వస్తే ఇస్మార్ట్‌ సినిమాతో సక్సెస్‌ ను దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత కరోనా కారణంగా ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. మళ్లీ ఈ అమ్మడు ఇండస్ట్రీ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అది ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.





Tags:    

Similar News