'రాయ‌న్' 10 త‌ల‌ల రాక్ష‌సుడా?

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సన్ పిక్చర్స్ తొలి పాట‌ విడుదల తేదీని ప్రకటిస్తూ థ్రిల్లింగ్ పోస్టర్‌ను షేర్ చేసింది. జూన్ 2024 నుండి రాయ‌న్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నార‌ని కూడా ప్ర‌క‌టించింది.

Update: 2024-05-06 15:22 GMT

ధనుష్ న‌టిస్తున్న‌ తాజా చిత్రం 'రాయన్' 2024 మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ జాన‌ర్ లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్‌ను మే 9 న విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్ ధృవీకరించారు.

 

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సన్ పిక్చర్స్ తొలి పాట‌ విడుదల తేదీని ప్రకటిస్తూ థ్రిల్లింగ్ పోస్టర్‌ను షేర్ చేసింది. జూన్ 2024 నుండి రాయ‌న్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నార‌ని కూడా ప్ర‌క‌టించింది.

పోస్టర్‌లో ఘాడ‌త ఆక‌ర్షిస్తోంది. ధనుష్ నిప్పుల్లో కాలుతున్న‌ ఇటుకలపై కూర్చుని క‌నిపించాడు. నేపథ్యంలో రావణుడి విగ్రహం .. అత‌డి వెనుక, ఒక గుంపు చేతులు పైకెత్తి ఆయుధాల‌తో విరుచుకుప‌డుతూ యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇంత సీరియ‌స్ స‌న్నివేశంలోను ధనుష్ నిశ్చ‌లంగా ఎదుట‌కు చూస్తూ క‌నిపిస్తున్నాడు. డార్క్ థీమ్ తో పోస్ట‌ర్ ఎలివేష‌న్ మ‌న‌సుపై ఘాడ‌మైన ముద్ర‌ను వేస్తోంది. అయితే ధనుష్ ఫోజ్ చూడ‌గానే ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాయ‌న్' అంటే రాక్ష‌సుడా?.. 10 త‌ల‌ల రావణాసురుడా? అంటూ కొంద‌రు నెటిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు.

ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రంగా రాయన్ రికార్డుల‌కెక్కింది. ఇందులో అత‌డు కీల‌క పాత్ర‌లో న‌టించారు. 13 జూన్ 2024న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్, వరలక్ష్మి త‌దిత‌రులు న‌టించారు. శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్, శరవణన్ వంటి సీనియ‌ర్ స్టార్లు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రంలో నిత్యా మీనన్ ప్రత్యేక పాత్ర గురించి కూడా పుకార్లు ఉన్నాయి. ఒక‌వేళ ఇది నిజ‌మైతే ధనుష్‌తో 2022 చిత్రం తిరుచిత్రంబలం తర్వాత నిత్యాకు రెండవ అవ‌కాశంగా భావించాలి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి లెజెండరీ ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Tags:    

Similar News