పిలవగానే తన హీరో కోసం పరిగెత్తుకొచ్చిన ముంబై భామ..!!
హిందీ టు తెలుగు డబ్బింగ్ సీరియల్ 'చిన్నారి పెళ్ళి కూతురు’తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుని మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది యంగ్ బ్యూటీ అవికా గోర్. ఆ తర్వాత 2013లో ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఆ చిత్రం మంచి హిట్ కావడంతో వెంటనే అవికాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ లాంటి హిట్ సినిమాలలో నటించింది భామ. అయితే ‘అవికా కాస్త లావుగా తయారయ్యిందే’ అనే కామెంట్స్ వినిపించడంతో సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకొని.. ఏం వర్కౌట్లు చేసిందో ఏమో గానీ చాలా సన్నబడి ‘రాజుగారి గది’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇక అవికా ఈ చిత్రం ప్రమోషన్ల టైంలోనే గ్లామర్ పాత్రలకు నేను రెడీ అనే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ అవికాకు ఈ మధ్య సరైన హిట్ లేక మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది.
ఇక అవికాతో పాటే సినీ కెరీర్ ప్రారంభించిన తెలుగు కుర్రాడు రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా మారి మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ గత కొంత కాలంగా రాజ్ కూడా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక అవికా, రాజ్ తరుణ్ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి రెండు హిట్ సినిమాలలో నటించారు. అలాగని ఎప్పుడు ఒకరినొకరు మంచి చెడులు మాట్లాడుకునే ఉంటారు. అయితే ఇటీవల రాజ్ తరుణ్ హైదరాబాదులో సొంత ఇంట్లో అడుగు పెట్టాడు. ఆ గృహ ప్రవేశనికి అవికాను కూడా ఆహ్వానించడంతో ఆమె హాజరై రాజ్ ఫ్యామిలీని సంతోషపెట్టింది. ఇక తను పిలవగానే వచ్చినందుకు థాంక్స్ తెలుపుతూ.. రాజ్ తరుణ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసాడు. ఇక 'మొదటి నుండి తనకు సపోర్ట్ గా ఉంటున్నందుకు చాలా థాంక్స్' అంటూ కాప్షన్ యాడ్ చేసాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.