• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డార్లింగ్ ఫ్యాన్స్ కోసం...

డార్లింగ్ ఫ్యాన్స్ కోసం 'రాధేశ్యామ్' కొత్త కంటెంట్ రెడీ..!

By - Tupaki Desk
Update: 2022-02-24 01:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్'. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 2022, మార్చి 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే విడుదల తేదీకి రెండు వారాలే సమయం ఉన్నా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయడం లేదని.. ప్రమోషనల్ కంటెంట్ వదలడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ నిర్మాతలను ట్రోల్ చేస్తున్నారు.

'రాధేశ్యామ్' సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ - ట్రైలర్ - నాలుగు పాటలు విడుదలయ్యాయి. సందర్భం వచ్చినప్పుడల్లా స్పెషల్ పోస్టర్స్ వదులుతూ ఉన్నారు. ముందుగా సంక్రాంత్రికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేయడంతో.. దానికి తగ్గట్టే భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇటీవల వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఓ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసారు.

అయినప్పటికీ ప్రభాస్ అభిమానులు మాత్రం 'రాధే శ్యామ్' నుంచి అంతకుమించి ఏదైనా కంటెంట్ వదిలేలా ప్లాన్ చేసుకోమని మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇది సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్ చేసే వరకు వెళ్ళింది. అయితే ఇప్పటికే అవసరమైన కంటెంట్ వదిలిన మేకర్స్.. ఇకపై ఏమి వదిలినా స్టోరీలో ఆసక్తికరమైన పాయింట్స్ రివీల్ అయ్యే ప్రమాదం ఉంది.

ఇవేమీ ఆలోచించని అప్డేట్స్ ఇవ్వడం లేదంటూ ఫ్యాన్స్ మాత్రం నిర్మాతలను ట్రోలింగ్ చేస్తున్నారు. మిగతా హీరోల సినిమాల కంటెంట్ బయటకు వచ్చిన ప్రతీసారి ఫైర్ అవుతుంటారు. ఏదైతేనేం ఇప్పుడు వాళ్ళని శాంతింపజేయడానికి 'రాధే శ్యామ్' మేకర్స్ కొత్త ప్రమోషనల్ కంటెంట్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ ట్రైలర్ ను కూడా కట్ చేయడంతో పాటుగా.. మేకింగ్ వీడియోను సిద్ధం చేస్తున్నారట. అలానే ఐదో పాటను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

మార్చి మొదటి వారం మొదలుకొని సినిమా రిలీజ్ అయ్యే లోపు ఈ కంటెంట్ అంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్పెషల్ ఇంటర్వ్యూలు - ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయనున్నారు. 'రాధే శ్యామ్' ప్రమోషన్స్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

కాగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాధేశ్యామ్' సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. 1970స్ యూరప్ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ ప్రేమకథా ఈ చిత్రం రూపొందింది. హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య గా ప్రభాస్ నటించగా.. ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ మరియు గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద నిర్మాతలుగా వ్యవహరించారు.
Tags:    
  • Prabhas 
  • Radheshyam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS