ఓపికతో ఉండమని డార్లింగ్ ఫ్యాన్స్ ని కోరుతున్న 'రాధే శ్యామ్' డైరెక్టర్..!

Update: 2021-01-05 08:17 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ''రాధే శ్యామ్''. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్‌ మరియు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్‌ - ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరకు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 'రాధే శ్యామ్' టీజర్ ని న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దీనికి  సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్‌ కాస్త నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో వారికి నచ్చజెప్పడానికి డైరెక్టర్‌ రాధాకృష్ణ రంగంలోకి దిగాడు.

రాధాకృష్ణ కుమార్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా 'రాధే శ్యామ్' టీజర్ గురించి క్లారిటీ ఇచ్చాడు. "రాధే శ్యామ్ టీజర్‌ అప్డేట్ అతి త్వరలో వస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా వేచి ఉండండి. మీ ఎదురుచూపులకు తగ్గ ఫలితం ఉంటుంది. మిలియన్ నవ్వుల సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆ విషయంలో నేను ప్రామిస్‌ చేస్తున్నాను" అని రాధాకృష్ణ కుమార్‌ ట్వీట్ చేసాడు. కాగా, 'రాధే శ్యామ్' తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. ఇందులో జగపతిబాబు - సత్యరాజ్ - భాగ్య‌శ్రీ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - శాషా ఛ‌త్రి - ప్రియ‌ద‌ర్శి - రిద్దికుమార్‌ - స‌త్యాన్ తదితరులు నటిస్తున్నారు.
Tags:    

Similar News