సర్దార్ ఖైదీలను క్యాష్ చేసుకుంటోంది

Update: 2017-03-28 17:56 GMT
దక్షిణాది ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి పేరు ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది. గతేడాది పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ లో 'తోబ తోబ' అంటూ ఐటెం సాంగ్ లో ఆడిపాడిన ఈ భామ.. ఈ ఏడాది మెగాస్టార్ కంబ్యాక్ మూవీ 'ఖైదీ నంబర్ 150'లో రత్తాలు పాటతో మెప్పించేసింది.

వరుసగా రెండు మెగా మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేయడంతో.. టాలీవుడ్ లో ఈ భామ పేరు మార్మోగిపోతోంది. మరోవైపు.. అమ్మడితో ఆన్ స్టేజ్ పెర్ఫామెన్స్ లు చేయించేందుకు కూడా ఈవెంట్ నిర్వాహకులు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు హైద్రాబాద్ లో జరగనున్న ఐఫా అవార్డు వేడుకలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నాలుగు దక్షిణాది భాషలకు చెందిన పరిశ్రమల నుంచి వందలాది మంది సెలబ్రిటీలు రానున్నారు. ఈ కార్యక్రమంలో రాయ్ లక్ష్మి డ్యాన్సులు స్పెషల్ గా నిలవనున్నాయి. అన్ని భాషల పాటలకు చెందిన మెడ్లేకు ఈ భామ డ్యాన్స్ చేయనున్నా.. రత్తాలు.. తోబతోబ.. పాటలే సంథింగ్ స్పెషల్ గా నిలవనున్నాయి.

ఖైదీ నంబర్ 150 రిలీజ్ తర్వాత.. తొలిసారిగా ఈ పాటను స్టేజ్ పై ప్రదర్శించనుండడంతో.. జనాల్లో కూడా బాగా ఆసక్తి కనిపిస్తోంది. మొత్తం మీద.. మెగాస్టార్.. పవర్ స్టార్ ల సినిమాల్లో ఆఫర్స్ తో క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా.. వాటిని ఈమె క్యాష్ చేసుకుంటున్న తీరు అధ్భుతం అనాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News