ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారో కాస్త చెప్పండయ్యా..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రం కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులను కూడా తీసుకోవాలని 'పుష్ప' టీమ్ భావించింది. ఇందులో కీలకమైన రోల్ కోసం కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ని తీసుకున్నారు. అయితే లాక్ డౌన్ రావడంతో విజయ్ డేట్స్ మిస్ అయి ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఈ రోల్ లో ఎవరు నటిస్తున్నారనే దానిపై రోజుకో న్యూస్ వస్తూనే ఉంది.
హీరో విక్రమ్ - బాబీ సింహా - సముద్రఖని - మాధవన్ - ఉపేంద్ర - సుదీప్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ పాత్ర కోసం కోలీవుడ్ హీరో ఆర్య ను సంప్రదిస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఆర్య గతంలో బన్నీ హీరోగా నటించిన 'వరుడు' సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బన్నీని ఢీ కొట్టడానికి ఆర్య సిద్ధమవుతున్నాడు అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న 'పుష్ప' చిత్రంలో విలన్ పాత్రలో ఎవరు నటిస్తారనేది సస్పెన్స్ గా మారింది. త్వరలోనే ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారో అధికారికంగా వెల్లడించి ఈ రూమర్స్ కి చెక్ పెడితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.