మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా పూరీ 'రొమాంటిక్'.. థియేట్రికల్ రిలీజ్ పై క్లారిటీ..!
'మెహబూబా' సినిమాతో హీరోగా పరిచయమైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్.. ఇప్పుడు 'రొమాంటిక్' చిత్రంతో అదృష్టం పరీక్షించుకోడానికి రెడీ అయ్యాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి పూరీ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2021 జూన్ 18న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా 'రొమాంటిక్' మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేస్తామంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
IMDB లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ సినిమాల జాబితాలో ''రొమాంటిక్'' సినిమా 2వ స్థానంలో ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరీ - కేతికా శర్మ ల రొమాంటిక్ ఫీవర్ త్వరలో థియేటర్లలో ఫైర్ అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఎంత లేట్ అయినా ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయడానికే చూస్తున్నారని అర్థం అవుతోంది. కాగా, రొమాంటిక్ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. మకరంద్ దేశ్ పాండే - ఉత్తేజ్ - సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నాడు. నరేష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ - చార్మీ కౌర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.